Andhra Pradesh: విధులకు డుమ్మా కొడితే ఇంటికే.. 43 మంది డాక్టర్లపై ఏపీ సర్కార్ కఠిన చర్యలు..
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలో పనిచేస్తూ అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న 43 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను శాశ్వతంగా విధుల నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టింది. పలుమార్లు సంజాయిషీ నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వాస్తవానికి సెకండరీ హెల్త్ పరిధిలో మొత్తం 118 మంది…
