ఢిల్లీకి చేరింది కాళేశ్వరం కుస్తీ..! ప్రాజెక్టు చుట్టూ పంతం పాలిటిక్స్
కాళేశ్వరం కాదు, కొంప కొల్లేశ్వరం అని ప్రాసలతో పంచ్‌లతో పొట్టుపొట్టు తిట్టుకుంటున్న పార్టీలు ఇప్పట్లో అలసిపొయ్యేలా కనిపించడం లేదు. నీళ్లొదలండయ్యా బాబూ అని కన్నెపల్లి పంప్‌హౌస్ దగ్గర కేటీఆర్ పోరుబాటతో మొదలైంది రాజకీయం. బలీయమైన రైతు ఓటుబ్యాంకును కొల్లగొట్టడం కోసం అధికార ప్రతిపక్షాలు కళాత్మకంగా ఫైటింగ్‌కి దిగేశాయి. దీంతో కొత్తకొత్త కలర్లలోకి మారుతోంది కాళేశ్వరం పొలిటికల్ గ్రౌండ్. కాంగ్రెస్ పార్టీని కార్నర్ చెయ్యడానికి నెత్తురు చిందించేదాకా శ్రమిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఏ స్పష్టమైన వైఖరీ తీసుకోకపోయినా కాళేశ్వరం…
