తాజావార్తలు

EPFO: ఈ ఒక్క పని చేస్తే పీఎఫ్ డబ్బులు మొత్తం మీవే.. ఒక్క రూపాయి కూడా కట్ అవ్వదు..

EPFO: ఈ ఒక్క పని చేస్తే పీఎఫ్ డబ్బులు మొత్తం మీవే.. ఒక్క రూపాయి కూడా కట్ అవ్వదు..


ఈపీఎఫ్‌వో డబ్బులు విత్ డ్రా చేసుకునే సమయంలో ట్యాక్స్ ఫ్రీ అని అందరూ అనుకుంటారు. కానీ అన్నీ పన్ను రహితం కాదు. కొన్ని లావాదేవీలపై పన్ను విధిస్తారు. వీటి గురించి మీరు ముందే తెలుసుకోవడం వల్ల పన్ను కోతల నుంచి తప్పించుకోవచ్చు. మీ సర్వీస్ కాలం, మీ క్లెయిమ్స్‌ను బట్టి పన్ను అనేది ఉంటుంది. మీరు కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల పన్ను నుంచి బయటపడవచ్చు. సరైన ప్రణాళికలు లేకుండా నగదు ఉపసంహరణ చేస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అసలు ఎలాంటి నియమాలు ఉన్నాయి..? వేటిపై పన్ను పడుతుంది? అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.

ఐదేళ్ల సర్వీస్ పీరియడ్

మీరు కనీసం ఐదేళ్లు ఉద్యోగం చేసినట్లయితే పీఎఫ్ విత్ డ్రా చేసుకునే సమయంలో ఎలాంటి ట్యాక్స్ పడదు. ఐదేళ్ల కంటే తక్కువ సమయం పని చేసి నగదు ఉపసంహరించుకోవాలని అనుకుంటే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీరు ఉద్యోగం మారినప్పుడు మీ పీఎఫ్ అకౌంట్‌ను కొత్త కంపెనీకి బదిలీ చేయాలి. ఇలా చేయకపోతే పన్ను విధిస్తారు. ఇక రూ.50 వేల వరకు ఉన్న మొత్తంపై టీడీఎస్ తీసివేస్తారు. అయితే ఐదేళ్లలోపు రూ.50 వేల కంటే ఎక్కువ విత్ డ్రా చేస్తుంటే ఫారం 15G/15H దాఖలు చేయడం ద్వారా పన్ను మినహాయింపులు పొందవచ్చు. మీ ఆదాయం పన్ను పరిమితి కంటే తక్కువగా ఉందని ప్రకటించడం వల్ల పన్ను మినహాయింపులు ఉంటాయి. ఆ ఫారం దాఖలు చేయకపోతే 10 శాతం టీడీఎస్ కట్టాల్సి ఉంటుంది.

పాన్ కార్డును లింక్ చేయకపోతే..

మీ యూఏఎన్ నెంబర్‌కు పాన్ కార్డును లింక్ చేయకపోతే 10 శాతం నుంచి 20 శాతం వరకు టీడీఎస్ విధిస్తారు. అందుకే పాన్ కార్డును లింక్ చేసుకోవాలి. అలాగే కేవైసీని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఐదేళ్ల సర్వీస్ పీరియడ్ తర్వాతనే విత్ డ్రా చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ట్యాక్స్ అనేది ఉండదు. అందుకే ఆ సర్వీస్ కాలం పూర్తైన తర్వాత ఉపసంహరించుకోండి. అలాగే పీఎఫ్ డబ్బులను తరచుగా తీసుకోవడం మంచిది కాదు. ఇది మీ పదవీ విరమణ నిధిని తగ్గిస్తాయి. ప్రతీసారి విత్ డ్రా చేయడం వల్ల మీకు వడ్డీ కూడా రాదు. దీని వల్ల మీరే నష్టపోవాల్సి ఉంటుంది. పీఎఫ్ నిబంధనల గురించి మీరు అవగాహన కలిగి ఉండటం వల్ల పన్నుల నుంచి బయట పడవచ్చు. చాలామందికి ఇవేమీ తెలియక నష్టపోతుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *