తాజావార్తలు

Cyclone Aquan: బలపడుతున్న అల్పపీడం.. సోమవారం తుఫాన్‌గా మారే ఛాన్స్.. ఇదిగో లేటెస్ట్ అప్‌డేట్


ఆగ్నేయ బంగాళాఖాతంలో సుస్పష్టమైన అల్పపీడనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. ఇది వాయవ్య దిశగా పయనిస్తూ ఆదివారం అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం ఉదయానికి తీవ్రవాయుగుండంగా, అలాగే సాయంత్రానికి దక్షిణమధ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. బుధవారానికి తీవ్రతుపాన్ గా మారే అవకాశం ఉందన్నారు. ఆ తరువాత ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. ఈ వాతావరణ పరిస్థితులని నిశితంగా పర్యవేక్షిస్తూ తుపాన్ పయన మార్పులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తామని పేర్కొన్నారు.

తెలంగాణలో వాతావరణం ఇలా

ఇదిలా ఉండగా ఈ తుఫాన్ ప్రభావంతో అటు తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కరిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర తెలిపింది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులలో రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే రాష్ట్రంలో రాగల రెండు రోజులలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంచుమించు ఇదే స్థితిలో కొనసాగే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *