తాజావార్తలు

Cyclone Alert: తీరానికి 160 కిలో మీటర్ల దూరంలో సైక్లోన్.. పలు విమాన సర్వీసులు రద్దు


అర్నబ్ తుఫాన్‌ నుంచి తేరుకుని వారం కూడా కాక ముందే ఏపీకి మరో తుఫాన్ ముప్పు ఎదురైంది. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా మురసు బలపడుతోంది. గ‌డ‌చిన 6 గంట‌ల్లో గంట‌కు 22 కిమీ వేగంతో క‌దులుతున్న తీవ్ర తుపాన్ సోమవారం అర్ధ రాత్రి – తెల్లవారుజాము సమయంలో నెల్లూరు-న‌రసాపురం మ‌ధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటే అవ‌కాశం ఉందని ఏపీ వివపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జౌన్ స్పష్టం చేశారు.

ఈ తీవ్ర తుఫాన్ కదలికలపై ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణలో ఉన్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ తుఫాన్ నెల్లూరుకు 160 కిమీ, చెన్నైకి 180 కిమీ, కావలికు 180 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని.. ఒంగోలుకు 210 కిమీ, మ‌చిలీప‌ట్నానికి 240 కిమీ దూరంలో కేంద్రీకృతమైందన్నారు. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని.. సముద్రం కూడా అల్లకల్లోలంగా మారే ఛాన్స్ ఉందని.. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్ల వద్దని సూచించారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

విమాన సర్వీసులపై తుఫాన్ ఎఫెక్ట్‌

ఇదిలా ఉండగా ఈ తుఫాన్ ప్రభావం అటు విమానాలపై కూడా పడింది. మురాసు తుఫాన్ ప్రభావంతో ఇండిగో (IndiGo) ఎయిర్‌ లైన్స్ పలు విమానాలు రద్దు చేసింది. అలాగే కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తాయని పేర్కొంది. రాజమండ్రి, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించే పలు సర్వీసులకు అంతరాయం కలిగినట్టు ప్రయాణికుల మొబైల్ నంబర్లకు మెసేజ్‌ల ద్వారా సమాచారం అందిస్తోంది. కాబట్టి విమానాశ్రయాలకు బయలుదేరే ముందే ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు ఇండిగో కోరింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *