తాజావార్తలు

Cinema: ప్రతి క్షణం ఉత్కంఠ.. సీన్ టూ సీన్ చూస్తే గుండెల్లో వణుకుపుట్టాల్సిందే.. అయినా ఓటీటీలో ఊర మాస్ రెస్పాన్స్..

Cinema: ప్రతి క్షణం ఉత్కంఠ.. సీన్ టూ సీన్ చూస్తే గుండెల్లో వణుకుపుట్టాల్సిందే.. అయినా ఓటీటీలో ఊర మాస్ రెస్పాన్స్..


కొన్ని సినిమాలు నెమ్మదిగా మొదలై భారీ విజయాన్ని సాధిస్తాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై విపరీతమైన రెస్పాన్స్ అందుకుంటాయి. అయితే ఇప్పుడు ఓటీటీలో వైరలవుతున్న ఒక సినిమా మొదటి సన్నివేశం నుంచి చివరి క్లైమాక్స్ వరకు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ మూవీ చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మానవ అహం ఎంత ప్రమాదకరమో ఈ మూవీ మనకు తెలియజేస్తుంది. మనం మాట్లాడుకుంటున్న ఈ మూవీ పేరు అయ్యప్పనుమ్ కోషియమ్. మలయాళంలో రూపొందించిన ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అధికారం, అణచివేత మధ్య జరిగే పోరాటమే ఈ మూవీ. కోషి కురియన్ అనే ధనవంతుడు.. మాజీ సైనికాధికారి, అట్టపాడి కొండలలో మద్యం సిసాలతో కారు నడుపుతూ ఉండగా అతడిని పోలీసులు ఆపుతారు. అట్టపాడి కొండల మధ్య మద్యం సేవించడం నిషేదమని అతడిని అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్తారు.

ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..

అయితే అప్పుడు కోషి అహంకారం, సబ్ ఇన్పెక్టర్ అయ్యప్పన్ నాయర్ మధ్య వివాదం మొదలవుతుంది. కోషి కారణంగా అయ్యప్పన్ తన ఉద్యోగం కోల్పోవడం.. తర్వాత ఇద్దరి జీవితాల్లో ఎలా మార్పులు వస్తాయనేది సినిమా. ఈ చిత్రం కేవలం ధనవంతుడు, అహంకారి అయిన కోషికి, గిరిజనుడైన అయ్యప్పన్‌కు మధ్య జరిగే అహం పోరాటం మాత్రమే కాదు. ఈ రెండు పాత్రల వెనుక కేరళకు సంబంధించిన సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇందులో బిజు మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు.

ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..

ప్రశాంతంగా ప్రారంభమయ్యే బిజు మీనన్, దూకుడుగా ఉండే ‘మాస్’ అవతారం ఎత్తే సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. పృథ్వీరాజ్ తన ఆధిపత్య పాత్రలో ఆకట్టుకున్నాడు. దాదాపు మూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమా ఒక్కో క్షణం ప్రేక్షకులకు ఎక్కడా విసుగు పుట్టించకుండా సాగుతుంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ సినిమాను అస్సలు మిస్సవ్వకండి.

ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *