ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట జంతు ప్రేమికుల ఆందోళన..రోడ్డుపై పడుకుని నిరసన
తెలంగాణలో కుక్కలు,కోతులను చంపేస్తున్నారని, మూగ జీవాలను చంపొద్దంటూ జంతు ప్రేమికులు ఢిల్లీ తెలంగాణ భవన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. పీపుల్ ఫర్ ఇండియా ఆధ్వర్యంలో జంతు ప్రేమికులు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెయ్యికి పైగా కుక్కలు, వందకు పైగా కోతుల దారుణ హత్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీపుల్ ఫర్ ఇండియా ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణలో కుక్కలు,కోతులను చంపడం సరికాదన్నారు. మూగ జీవాలకు ఎక్కడో…
