అమరావతి రైతులకు ‘ప్లాట్’ పండుగ.. ఉండవల్లి రైతులకు ఎట్టకేలకు మోక్షం
అమరావతి రాజధాని ప్రాంత రైతులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) జనవరి 29న మలివిడత ప్లాట్ల కేటాయింపును నిర్వహించనుంది. గతంలో జనవరి 28న లాటరీ నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, కొన్ని కీలక కార్యక్రమాలు ఉన్నందున దీనిని 29వ తేదీకి వాయిదా వేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం భూములిచ్చిన రైతులకు ఈ లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయిస్తారు. పారదర్శకతను దృష్టిలో ఉంచుకొని ఈ-లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు జరగనుంది. ఉండవల్లి, పెనుమాక సహా ఇతర…
