స్వింగ్ సుల్తాన్ విశ్వరూపం.. ఐపీఎల్లో సరికొత్త చరిత్ర.. అరుదైన రికార్డుతో దిగ్గజాల సరసన ‘భువీ’..!
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరుకు భువనేశ్వర్ కళ్లు చెదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. తన పదునైన అవుట్ స్వింగర్లతో ముంబై బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముందుగా ప్రమాదకరమైన ర్యాన్ రికెల్టన్ను పెవిలియన్ పంపిన భువీ, ఆ తర్వాత విధ్వంసకర ఫామ్లో ఉన్న రోహిత్ శర్మను (22) అవుట్ చేసి ముంబైని కోలుకోలేని దెబ్బ తీశాడు. అంతటితో ఆగకుండా, ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను గోల్డెన్ డక్గా అవుట్ చేయడంతో స్టేడియం హోరెత్తిపోయింది. పవర్ ప్లేలోనే 3 వికెట్లు…
