ఆ హీరో కాలర్ పట్టుకున్న నాగార్జున.. కట్ చేస్తే బ్యానర్లు చించి, కటౌట్కు నిప్పు పెట్టిన ఫ్యాన్స్
1993లో విడుదలైన వారసుడు చిత్రం టాలీవుడ్లో ఒక ప్రత్యేక అధ్యాయం అనే చెప్పాలి. కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణల కలయికలో వచ్చిన ఈ మల్టీస్టారర్ మూవీ, అనౌన్స్ అయినప్పటి నుంచీ విడుదలైన తర్వాత వరకు అనేక ఆసక్తికర విశేషాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. 1993లో భారీ హిట్ సాధించిన ఈ చిత్రానికి ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. చిన్న, మీడియం హీరోలతో హిట్లు అందిస్తున్న ఈవివి, పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు చేయాలనుకుంటున్న సమయంలో,…
