తాజావార్తలు

Vastu Tips : పంచదారను ప్లాస్టిక్ డబ్బాలోనే ఉంచుతున్నారా? వాస్తు చెప్పే సంగతి తెలిస్తే షాకే!

పంచదారను సరైన విధంగా నిల్వ చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం, ఆర్థిక పురోగతి, కుటుంబంలో ప్రశాంతత ఏర్పడతాయని కొన్ని వాస్తు నమ్మకాలు చెబుతున్నాయి. అందుకే పంచదారను ఎలాంటి పాత్రలో పెట్టాలి, వంటగదిలో ఏ దిశలో ఉంచాలి, ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. 1. ప్లాస్టిక్ డబ్బాలో పంచదార పెట్టకూడదట వాస్తు నియమాల ప్రకారం పంచదారను ప్లాస్టిక్ పాత్రలో నిల్వ చేయడం మంచిది కాదని చెబుతారు. దానికి బదులుగా శుభ్రమైన గాజు పాత్రలో నిల్వ…

Read More

ఈ తప్పులు చేస్తే మీ వాట్సప్ అకౌంట్ శాశ్వతంగా బ్లాక్.. అస్సలు చేయకూడని పనులివే..

స్మార్ట్‌ఫోన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరి ఫోన్లలో తప్పనిసరిగా వాట్సప్ అనేది ఉంటుంది. విద్య, వ్యాపారం, ఉద్యోగ అవసరాల కోసం ఈ ఫ్లాట్‌ఫామ్ ఉపయోగించడం తప్పనిసరి అయింది. ఇక స్నేహితులు, బంధువులతో ఛాటింగ్, వీడియో, ఆడియో కాల్స్, ఫొటోలు పంపించుకోవడానికి వాట్సప్ బాగా ఉపయోగపడుతుంది. అయితే వాట్సప్ ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు శాశ్వతంగా బ్లాక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఒకేసారి వేర్వేరు నెంబర్ల నుంచి పెద్ద సంఖ్యలో…

Read More

Gold Price Today: అక్టోబర్ 1న మరింత తగ్గిన పసిడి రేట్లు

ప్రస్తుతం అంతర్జాతీయంగా పరిస్థితులు కొంత సద్దుమణిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత సెప్టెంబర్ నెలలో పసిడి ధరలు గణనీయంగా పడిపోయి సామాన్యులకు కొంత ఊరటనిచ్చాయి. అయితే, ఇది పెట్టుబడిదారులకు మాత్రం కొంత నిరాశను మిగిల్చిందని చెప్పవచ్చు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు బంగారం ధరలను నిరంతరం ఒడిదుడుకులకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, పసిడి ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో అంతుచిక్కడం లేదు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆర్థిక నిపుణులు…

Read More

Allu Arjun: అల్లు రామలింగయ్య జయంతి.. సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టిన అల్లు అర్జున్ ఫ్యామిలీ

ప్రముఖ హాస్యనటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య జయంతి (అక్టోబర్01)ని మెగా, అల్లు కుటుంబీకులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు కూడా అల్లు రామలింగయ్య సేవలను స్మరించుకున్నారు. ఇదే సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఫ్యామిలీ సరి కొత్త అధ్యాయానికి నాంది పలికారు. అదేంటంటే.. తనకెంతో ఇష్టమైన తాతయ్య జయంతి సందర్భగా కొత్త కార్యాలయానికి శ్రీకారం చుట్టారు బన్నీ. ఐకాన్‌జా పేరుతో ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు….

Read More

2027లో రూ.3 లక్షలా..? బాబా వంగా ‘బంగారం’ అంచనాలు వైరల్.. అసలు నిజమేంటి?

అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయిలలో శరవేగంగా దూసుకెళ్తున్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర లక్షన్నర మార్క్ దాటింది.. ఈ నేపథ్యంలో 2027 నాటికి పసిడి ధరలు మరింతగా పెరగనున్నాయంటూ సోషల్ మీడియాలో బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ భవిష్యవేత్త బాబా వంగా (Baba Vanga) పేరుతో ఓ ప్రచారం వైరల్‌గా మారింది. మరోవైపు, సోషల్ మీడియా వదంతులను పక్కనబెడితే.. గ్లోబల్ ఆర్థిక సంస్థలైన జేపీ మోర్గాన్, యూబీఎస్ కూడా రాబోయే సంవత్సరాల్లో…

Read More

Gandhi Jayanti 2026: పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాల్సిన బాపూజీ పంచ సూత్రాలు.. జాతిపిత సన్మార్గాలు!

ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా గాంధీ జయంతిని జరుపుకుంటాం. 1869 అక్టోబర్ 2న జన్మించిన మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. సత్యం, అహింస, సరళత వంటి ఆయన ఆలోచనలు భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి. గాంధీ జయంతి సందర్భంగా పిల్లలకు ఆయన జీవితంలోని విలువలను పరిచయం చేయడం ద్వారా చిన్నతనం నుంచే మంచి అలవాట్లు, బాధ్యత, నిజాయితీ, ఇతరుల పట్ల గౌరవం వంటి లక్షణాలను పెంపొందించవచ్చు. తల్లిదండ్రులు పిల్లలకు…

Read More

విదేశీ యువతులతో వల.. హైదరాబాద్‌లో హైటెక్ దందా..! కథ మామూలుగా లేదుగా..

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో హోటల్‌ కేంద్రంగా సాగుతున్న హైటెక్ వ్యభిచార వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. విదేశీ మహిళలను నగరానికి తీసుకొచ్చి హోటల్‌లో వేర్వేరు గదులు ఏర్పాటు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో గచ్చిబౌలి పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు సంయుక్తంగా డ్రీమ్‌ ప్రైడ్‌ హోటల్‌పై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఢిల్లీకి చెందిన నిఖిల్‌, రామ్మోహన్‌రెడ్డితో పాటు హర్షిత్‌ సింఘానియాను అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు హోటల్‌లో ఉన్న ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ముగ్గురు మహిళలను…

Read More

Indian Oil: ఇండియన్ ఆయిల్ సరికొత్త బిజినెస్ స్ట్రాటజీ.. మరో వ్యాపారంలోకి గ్రాండ్ ఎంట్రీ

ప్రముఖ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మరో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు కేవలం పెట్రోల్, డీజిల్ విక్రయాల రంగంలోనే ఉండగా.. ఇప్పుడు మరో బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. అదే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బిజినెస్. ఇండియన్ ఆయిల్ బ్రాండ్ పేరుతో డ్రింకింగ్ వాటర్ బాటిళ్లను తీసుకురానుంది. దేశవ్యాప్తంగా ఉన్న 43 వేలకుపైగా తమ రిటైల్ అవుట్‌లెట్లలో ఈ వాటర్ బాటిళ్లను అందుబాటులోకి ఉంచి విక్రయించనుంది. ఇంధనం విక్రయంతోనే కాకుండా ఇతర…

Read More

ఏఐ దూకుడుకు కళ్లెం.. ఎన్విడియా కొత్త టూల్ ఆవిష్కరణ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రత విషయంలో ప్రముఖ టెక్‌ దిగ్గజం, చిప్‌మేకర్ ఎన్విడియా కీలకమైన ముందడుగు వేసింది. ఏఐ ఏజెంట్లు అదుపు తప్పకుండా పర్యవేక్షించేందుకు 100కు పైగా పరిశ్రమ భాగస్వాములతో కలిసి ‘ఎన్విడియా ఓపెన్ ఏజెంట్ సేఫ్టీ ప్లాట్‌ఫామ్’ అనే కొత్త సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. ఇటీవల కొన్ని ఏఐ వ్యవస్థలు స్పష్టమైన ఆదేశాలు లేకుండానే ప్రభుత్వ, కార్పొరేట్ సైట్లలోకి చొరబడ్డాయనే వార్తలు కలకలం రేపాయి. దీంతో ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్ అధిపతులు ఏఐపై కఠిన నియంత్రణలు ఉండాలని డిమాండ్…

Read More

World Cup 2027 Schedule: మరికొద్ది గంటల్లో ప్రపంచకప్ షెడ్యూల్.. అందరి చూపు భారత్, పాక్ మ్యాచ్‌పైనే?

ODI World Cup 2027 Schedule: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్‌పై ఇవాళ స్పష్టత రానుంది. ICC అక్టోబర్ 1న కేప్‌టౌన్‌లో అధికారిక షెడ్యూల్‌ను ఆవిష్కరించనుంది. భారత్ మ్యాచ్‌లు ఏ తేదీల్లో జరగనున్నాయి? పాకిస్థాన్‌తో పోరు ఎప్పుడు? ఏ వేదికల్లో మ్యాచ్‌లు ఉంటాయి? వంటి ప్రశ్నలకు ఇవాళ సమాధానం దొరకనుంది. ODI World Cup 2027 Schedule ఎక్కడ చూడాలి? ఐసీసీ అధికారిక సమాచారం ప్రకారం భారత్‌లో షెడ్యూల్ లాంచ్‌ను…

Read More