Gunasekhar : ఎన్టీఆర్‌తో సినిమా కోసం ఆరు నెలలు తిరిగా.. ఎందుకు చేయలేదంటే.. అసలు విషయం చెప్పిన గుణశేఖర్..
దర్శకుడు గుణశేఖర్ ఇప్పుడు యుఫోరియా సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన సినీ ప్రయాణం, స్టార్ హీరోలతో బాండింగ్ పై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌తో ఒక సినిమా చేయాలని ఆరు నెలల పాటు కథా చర్చలు నడిపినట్లు, అయితే కథ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్టును వదులుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అనంతరం, తన ప్రతిష్టాత్మక చిత్రం రుద్రమదేవి నిర్మాణ సమయంలో ఎదురైన…
