తాజావార్తలు

ICC: హైదరాబాద్‌కు చెందిన స్టార్‌ క్రికెటర్‌పై నిషేదం.. 8 ఏళ్ల పాటు బ్యాన్ చేసిన ఐసీసీ!

ICC: హైదరాబాద్‌కు చెందిన స్టార్‌ క్రికెటర్‌పై నిషేదం.. 8 ఏళ్ల పాటు బ్యాన్ చేసిన ఐసీసీ!


భారత సంతతికి చెందిన మరో స్టార్ క్రికెటర్‌కు ఐసీసీ షాక్ ఇచ్చింది. అమెరికన్ క్రికెటర్‌ అయిన అఖిలేష్‌ రెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో అతనిపై 8 ఏళ్ల పాటు నిసేధాన్ని విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ అవినీతి నిరోధక ట్రిబ్యునల్ విచారణలో ఆయన దోషిగా తేలడంతో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి ఎనిమిదేళ్ల పాటు నిషేధిస్తున్నట్లు సోమవారం ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

ఐసీసీ ప్రకటన ప్రకారం.. భారత సంతతికి చెందిన అమెరికా ఆటగాడు బొడుగుమ్ అఖిలేష్‌ రెడ్డి ఐసీసీ యాంటీ కరప్షన్ కోడ్‌లోని మూడు నిబంధనలను ఉల్లంఘించారని.. ఈ మేరకు అతనిపై ఎనిమిదేళ్ల నిషేధం విధిస్తున్నట్టు ఐసీసీ స్పష్టం చేసింది.

అసలు ఏం జరిగింది?

యూఏఈ వేదికగా జరిగిన 2025 అబుదాబి T10 టోర్నీలో అఖిలేష్‌ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి ప్రయత్నించాడని, అలాగే పక్కవాళ్లను కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నిండాని వివచారణలో తేలింది. అలాగే నిబంధనలను ఇతరులను కూడా ప్రేరేపించాడన, విచారణాధికారులకు సహకరించకుండా, తన మొబైల్ ఫోన్ నుంచి కీలకమైన సమాచారం డిలీట్ చేశాడని విచారణలో తేలినట్టు ఐసీసీ పేర్కొంది.

హైదరాబాద్ టూ అమెరికా..

హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల అఖిలేష్ రెడ్డి చిన్నప్పటి నుంచే క్రికెట్‌లో బాగా రాణించేవాడు. ఇతను విజయ్ హజారే ట్రోఫీలో కూడా ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు సన్‌రైజర్స హైదరాబాద్‌ టీమ్‌కు నెట్‌ బౌలర్‌గా కూడా అఖిలేష్ సేవలందించారు. రైట్ హ్యండ్ బ్యాట్స్‌మెన్, ఆఫ్‌ స్పన్నర్ అయిన అఖిలేష్, అంతర్జాతీయ క్రికెట్ అవకాశాల కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడ అమెరికా జాతీయ జట్టుకు ఎంపికై కేమాన్ ఐలాండ్స్‌పై అరంగేట్రం చేశారు. ఇప్పటివరకు యుఎస్ఏ తరఫున 4 టీ20 మ్యాచ్‌లు ఆడిన అఖిలేష్ పరవాలేదనిపించుకున్నారు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *