Andhra Rains: ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు.. ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్.. పిడుగులు పడే అవకాశం
ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణ కేంద్రం విడుదల చేసింది. ఏపీలో రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే ప్రమాదం పొంచి ఉన్నందున…
