కావాల్సిన పదార్థాలు: మూడు కప్పుల ఉడికించిన అన్నం, 3 కోడిగుడ్లు, ఒక పెద్ద ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి , కరివేపాకు ఆకులు, మూడు టేబుల్ స్పూన్ల నూనె, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు ఎండు మిర్చి, 5 వెల్లుల్లి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు , అర టీ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ సెనగపప్పును తీసుకోవాలి.
కోడిగుడ్డు కారమన్నం తయారీ విధానం: నాలుగు ఎండు మిర్చి, వెల్లుల్లి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పును వేసి బాగా పట్టుకోవాలి.
పాన్లో రెండు టేబుల్ స్పూన్స్ నూనె, దానిలో గుడ్లు బ్రేక్ చేసి దానిలో వేయాలి. మళ్లీ అదే పాన్లో ఆయిల్ వేసి ఆవాలు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా సెనగపప్పు కూడా వేయాలి
ఆ తర్వాత దానిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు , నాలుగు పచ్చిమిర్చి, కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించాలి. ఆ తరువాత ఉడికించిన అన్నాన్ని దానిలో వేసి కలపాలి.
చివర్లో రెండు టేబుల్ స్పూన్స్ దానిలో వేసి కారం వేసి దానిలో మిక్స్ అయ్యేలా కలపాలి. ఇంకా దీనిని నెయ్యితో తింటే టేస్ట్ అదిరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.





