భారత్‌లోని ‘బ్లాక్ రివర్’ రహస్యం తెలుసా? హిమాలయాల నుంచి మైదానాల వరకు కాళీ నది ప్రస్థానం ఇదే!
గంభీరమైన లోయల గుండా ప్రవహిస్తూ, నలుపు రంగు ఛాయలను పులుముకున్నట్లు కనిపించే ఈ నదిని స్థానికులు ‘నల్ల నది’ అని పిలుచుకుంటారు. ఉత్తరాఖండ్‌లోని నందాదేవి పర్వత ప్రాంతాల్లో ఉద్భవించే ఈ జలప్రవాహం కేవలం ఒక నది మాత్రమే కాదు.. అది రెండు దేశాల మధ్య సరిహద్దు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే జీవనాధారం. హిమాలయాల్లోని ప్రతి నదికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని నదులు మంచు కరుగుతున్నప్పుడు స్వచ్ఛంగా ఉంటే, మరికొన్ని రుతుపవనాల సమయంలో బురద రంగులో…
