తాజావార్తలు

Bandla Ganesh: బండ్లన్న మజాకా! కూతురి ఎంగేజ్మెంట్‌కు వచ్చిన అతిథులకు ఏం గిఫ్ట్స్ ఇచ్చాడో తెలుసా? వీడియో

Bandla Ganesh: బండ్లన్న మజాకా! కూతురి ఎంగేజ్మెంట్‌కు వచ్చిన అతిథులకు ఏం గిఫ్ట్స్ ఇచ్చాడో తెలుసా? వీడియో


టాలీవుడ్ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె జనని వివాహం త్వరలోనే జరగనుంది. సూర్య తేజ అనే అబ్బాయితో కలిసి ఏడడుగులు నడవనుంది. ఇటీవలే వీరి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి తదితర ప్రముఖులు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. బండ్లన్న కుమార్తె ఎంగేజ్మెంట్ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కాగా ఈ వేడుకకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. తన కూతురి నిశ్చితార్థం వేడుకకు వచ్చిన అతిథులందరికీ బండ్ల గణేష్ ఖరీదైన రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ వేడుకకు వెళ్లిన ఒకరు బండ్లన్న రిటన్ గిఫ్ట్స్ కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఒక్కొక్కరికి రూ. 5వేల గిఫ్ట్..

బండ్ల గణేష్ జనని నిశ్చితార్థపు వేడుకకు హాజరైన అతిథులకు బర్గనర్ అనే ఆస్ట్రియా బ్రాండ్ కి సంబంధించిన బిర్యానీ హండి కానుకగా ఇచ్చారని తెలుస్తుంది. ఈ గిప్ట్ బాక్స్ లో ఒక స్వీట్ బాక్స్ తో పాటు ఒక బ్లౌజ్ పీస్ అలాగే దాదాపు 5 కిలోల బిర్యానీ హండి ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం ఈ కిచేన్ వేర్ దాదాపు 5000 రూపాయల విలువ చేస్తుందని సమాచారం. ఈ వీడియోను చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. బండ్లన్న కేవలం ఎంగేజ్మెంట్ కోసమే ఈ రేంజ్ లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఇక పెళ్లికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? అంటూ కామెంట్స్ పెడుతున్నారు? అలాగే పెళ్లి కూడా ఏ రేంజ్ లో చేస్తున్నారో? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

కాగా బండ్ల గణేష్ వియ్యంకుల విషయానికి వస్తే.. వీరికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే బండ్లన్నకు కాబోయే అల్లుడు చిలుకూరి సూర్య తేజకు కూడా కోట్లలో విలువ చేసే ఆస్తులు ఉన్నాయని సమాచారం. అయితే సూర్యతేజ చిలుకూరి వ్యక్తిగత వివరాలు మాత్రం తెలియడం లేదు. ఆయన జాబ్ చేస్తున్నారా? లేక రియల్ ఎస్టేట్ లోనే ఉంటున్నారా? లేదా మరేదైనా బిజినెస్ చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *