తాజావార్తలు

ఎన్టీఆర్ తర్వాత ఆ హీరోనే.. అలాంటి స్టార్ ఇంకొకరు లేరు..: నటుడు శివకృష్ణ

ఎన్టీఆర్ తర్వాత ఆ హీరోనే.. అలాంటి స్టార్ ఇంకొకరు లేరు..: నటుడు శివకృష్ణ


సీనియర్ నటుడు శివకృష్ణ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, దిగ్గజ నటులపై తనకున్న అభిప్రాయాలను వెల్లడించారు. తాను ఎన్టీఆర్ గారికి వీరాభిమానినని, ఆయన్ని దేవుడిలా చూస్తానని శివకృష్ణ స్పష్టం చేశారు. అయితే, తన సినీ జీవితంలో ఎక్కువ సినిమాలు సూపర్ స్టార్ కృష్ణతోనే చేశానని, ఆయన మహానుభావుడని కొనియాడారు. కృష్ణగారితో ఎనిమిది అద్భుతమైన సినిమాలు చేశానని, వాటిలో మంచి ప్రామిసింగ్ పాత్రలు లభించాయని తెలిపారు. కృష్ణగారి వ్యక్తిత్వాన్ని వివరిస్తూ, ఆయన అంత ఓపెన్ హార్టెడ్, కల్మషం లేని వ్యక్తి అని, రాజకీయాలు, చాడీలు వంటివాటిని అస్సలు పట్టించుకోరని అన్నారు. అటువంటి హీరోను తాను ఇంతవరకు చూడలేదని శివకృష్ణ పేర్కొన్నారు. కృష్ణంరాజు, శోభన్ బాబు వంటివారు సరదాగా ఉంటారని, కానీ కృష్ణగారు మాత్రం భోళా శంకరుడని, ఎన్టీఆర్ తర్వాత అంతటి భోళా శంకరుడు ఆయనేనని శివకృష్ణ అభిప్రాయపడ్డారు.

ఇది కూడా చదవండి : హిట్లర్ సినిమాలో చిరంజీవి చెల్లెళ్లు ఇప్పుడు ఎక్కడున్నారు.? ఏం చేస్తున్నారో తెలుసా.?

ఒక చిత్రంలో కృష్ణగారితో కలిసి పనిచేసినప్పుడు జరిగిన సంఘటనను శివకృష్ణ గుర్తు చేసుకున్నారు. అగ్ని కెరటాలు సినిమా షూటింగ్‌లో, దర్శకుడు తాతినేని రామారావు, నిర్మాత రెడ్డిగారితో కృష్ణ మాట్లాడుతూ, “శివకృష్ణ భలే వాడయ్యా… నా ఒక్కడితో అయితేనే సుఖం అంటా, ఏ హీరోతో సుఖం లేదు” అని జోక్ చేశారట. అసిస్టెంట్ డైరెక్టర్‌తో తాను చెప్పిన మాటలను కృష్ణగారు సరదాగా మార్చి చెప్పారని శివకృష్ణ నవ్వుతూ వివరించారు. వాస్తవానికి, తాను చెప్పినది ఏమిటంటే, కృష్ణగారు 2:45కి వచ్చేవారు, తాను 1 గంటకే భోజనం చేసి, మేకప్ వేసుకుని సిద్ధంగా ఉండేవాడినని, అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి రెడీ అని అడగకుండానే తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు.

ఇది కూడా చదవండి :ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడ్డా.. రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ కామెంట్స్

కృష్ణగారితో పనిచేస్తే మధ్యాహ్నం రెస్ట్ తీసుకునే సమయం ఉంటుందని తాను చెప్పగా, కృష్ణగారు దానిని సరదాగా మార్చి చెప్పి అందరినీ నవ్వించారని శివకృష్ణ తెలిపారు. కృష్ణగారి దాతృత్వం, నిజాయితీ గురించి మాట్లాడుతూ, ఆయన సినిమాలపై తిరిగి డబ్బులు పెట్టేవారని, ఏ నిర్మాతను కష్టపెట్టేవారు కాదని శివకృష్ణ వెల్లడించారు. డబ్బులు ఇవ్వకపోయినా పనిచేసేవారని, కానీ కృష్ణగారు మాత్రం తనకు మొదట్లో సహాయం చేసినవారికి సినిమా రిలీజ్‌ల సమయంలో స్వయంగా సంతకాలు పెట్టి డబ్బులు ఇచ్చేవారని, “నాది హామీ” అని చెప్పేవారని శివకృష్ణ గుర్తు చేసుకున్నారు. అటువంటి భలే మనిషి మళ్ళీ లేడని, ఇంకో హీరో లేడని ఆయన కృష్ణగారిని కొనియాడారు. కృష్ణగారితో పని చేయడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని శివకృష్ణ అన్నారు.

ఇది కూడా చదవండి : Trisha: విజయ్ కాదు అతనే నా ఫేవరెట్ హీరో.. ఊహించని పేరు చెప్పిన త్రిష

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *