తాజావార్తలు

ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం

ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం


ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం

ఇంటర్నెట్ కనెక్షన్ల కోసం ఉపయోగించే ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్సీ) ఇంటి ప్రైవసీకి కొత్త ముప్పును సృష్టిస్తున్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. డేటా చౌర్యం కంటే ఇది మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హాంగ్ కాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రచురించిన నివేదిక ప్రకారం, ఇంట్లోని ఓఎఫ్సీ కేబుల్స్ ద్వారా శబ్దాలను వినడం సాధ్యం. సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సతీష్ రెడ్డి వివరించినట్లుగా, ఇంట్లో వెలువడే శబ్దాలు ఓఎఫ్సీ కేబుల్‌ను తాకినప్పుడు, లోపల ప్రయాణించే కాంతి తరంగదైర్ఘ్యం లేదా వేగంలో చాలా సూక్ష్మమైన మార్పు వస్తుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ మార్పులను క్యాప్చర్ చేసి, వాయిస్‌ను డీకోడ్ చేయవచ్చు. తద్వారా, ఇంటి లోపలి సంభాషణలను పర్యవేక్షించే అవకాశం ఏర్పడుతుంది. ఈ ముప్పును నివారించడానికి, కేబుల్స్ ఇంట్లోకి రాకుండా వైఫై రోటర్ వద్ద మాత్రమే కనెక్షన్ ఇవ్వడం, కేబుల్ బండిల్స్ ఇంట్లో కాకుండా బయట ఏర్పాటు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

RTC Bus Drivers: బస్సు డ్రైవర్లు అంటే అంత చులకనా… ఇంకెంత కాలం బలి అవ్వాలి ?

దేవుడా.. అన్నదాతల కష్టాలు చూస్తున్నవా ?? పొలానికి ట్యాంకర్‌ నీళ్లే దిక్కు

ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్‌.. ఎక్కడో తెలుసా ??

టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ

రుణగ్రహీతలకు షాక్..పెరగనున్న EMI భారం ??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *