తాజావార్తలు

Viral Video: కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. పట్టుకుని పొట్ట ఎక్స్‌రే తీయగా

Viral Video: కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. పట్టుకుని పొట్ట ఎక్స్‌రే తీయగా


Viral Video: కడుపు ఉబ్బిపోయి కనిపించిన కొండచిలువ.. పట్టుకుని పొట్ట ఎక్స్‌రే తీయగా

ప్రపంచంలోని అతిపెద్ద పాములలో ఒకటి కొండచిలువ. కొన్ని రకాల కొండచిలువలు సుమారు 20 నుంచి 30 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ఇవి పరిమాణంలో చాలా ఎక్కువగా ఉంటాయి. తమకు ఎరగా దొరికిన వాటిని చుట్టేసి, ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తాయి. ఇవి ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియాలోని అడవుల్లో, చిత్తడి నేలల్లో కనిపిస్తాయి. ఇవి నీటిలో కూడా చాలా బాగా ఈదగలవు. సాధారణంగా మనుషులపై ఇవి దాడి చేయవు. కానీ వాటికి ప్రమాదం అనిపిస్తే మాత్రం రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో తరచుగా కొండచిలువకు సంబంధించిన వైరల్ వీడియోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. అవి కొన్ని భయంకరంగా ఉంటే.. ఇంకొన్ని షాక్‌కు గురి చేసేలా ఉంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది.

ఇది చదవండి: గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా రిపేర్ చేసుకోవచ్చు..

వైరల్ వీడియో ప్రకారం.. ఓ కొండచిలువ ఎంచక్కా సేద తీరుతూ ఒక గ్రౌండ్ లాంటి ప్రదేశంలో ఉంది. దాని కడుపు ఏమో ఉబ్బిపోయి కనిపించింది. స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఓ వ్యక్తి దాన్ని పట్టుకునేందుకు వచ్చాడు. చాకచక్యంగా దాని తలను పట్టుకుని బంధించాడు. అయితే అక్కడ దాన్ని పొట్ట ఎక్స్‌రే తీసి చూడగా.. అందులో ఓ జంతువు కళేబరం కనిపించింది. స్థానికంగా అది పిల్లాడిని మింగేసిందని వీడియో వైరల్ చేసినా.. కొందరు దాన్ని రూమర్ అని కొట్టిపారేశారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ ఓ సారి లుక్కేయండి.

 

View this post on Instagram

 

A post shared by Rv Jadhav (@akshatajadhav20042307)

ఇది చదవండి: అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది.. ఎందుకంటే.?



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *