సరైన పాత్రలను వాడండి: చాలా మంది తెలియక ఇండక్షన్‌పై ఏవంటే అవే పాత్రలు పెట్టి వండుతుంటారు. ఇది తప్పుడు దీనిపై ఎప్పుడూ చదునైన అడుగు భాగం ఉన్న పాత్రలనే వాడాలి. అడుగు భాగం వంకరగా ఉన్న పాత్రలు వేడిని సరిగ్గా గ్రహించలేవు, దీనివల్ల వంట ఆలస్యమవుతుంది. సరైన పాత్రలు వేడిని త్వరగా ప్రసరింపజేస్తాయి. కాబట్టి వాటిపై వంట త్వరగా అవుతుంది
మూత పెట్టి వండండి: కొంత మంది వంట చేసేప్పుడు పాత్రలపై మూత పెట్టరు. ఇలా చేయడం ద్వారా ఆవిరి మొత్తం బయటకు పోయి వంట ఆలస్యమవుతుంది. వంట చేసేటప్పుడు పాత్రపై మూత ఉంచడం వల్ల ఆవిరి లోపలే ఉండి ఆహారం త్వరగా ఉడుకుతుంది. ఇది వంట త్వరగా అయ్యేందుకు తోల్పడుతుంది.
ముందే నానబెట్టండి: పప్పులు, బియ్యం లేదా చిక్కుడు గింజల వంటి వాటిని వండడానికి ముందు కాసేపు నానబెట్టండి. దీనివల్ల అవి మెత్తబడి త్వరగా ఉడుకుతాయి, తద్వారా కరెంటు ఆదా అవుతుంది. అలాగే వంట కూడా త్వరగా అవుతుంది
ముక్కలను చిన్నగా కోయండి: కూరగాయలు లేదా ఇతర పదార్థాలను పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న ముక్కలుగా కోయండి. చిన్న ముక్కలు త్వరగా ఉడుకుతాయి, ఇది మీ సమయాన్ని, కరెంటు రెండింటిని ఆదా చేస్తుంది.
సరైన పవర్ సెట్టింగ్‌ను ఎంచుకోండి: చాలా మంది ఎక్కవ పవర్ పెడితే వంట త్వరగా అవుతుందని.. ఎప్పుడూ హై పవర్‌లోనే వండుతారు. కానీ ఎప్పుడూ హై పవర్లో ఉంచాల్సిన అవసరం లేదు. మొదట పాత్ర వేడెక్కడానికి హై పవర్ వాడి, ఆ తర్వాత మీడియం సెట్టింగ్‌కు మార్చుకోండి. దీనివల్ల వేడి తగ్గకుండా వంట వేగంగా జరుగుతుంది.
మళ్ళీ మళ్ళీ వేడి చేయడం: కొందరు వండి ఆహారం చల్లారిందని.. మళ్లీ వేడి చేస్తుంటారు. ఇలా ఒకే ఆహారాన్ని పదేపదే వేడి చేయడం వల్ల కరెంటు బిల్లు పెరుగుతుంది. కాబట్టి మీకు అవసరమైన పరిమాణంలో ఒకేసారి వండుకోవడం లేదా వేడి చేసుకోవడం మంచిది. ఇండక్షన్ స్టౌవ్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి, దీనివల్ల పాత్రకు వేడి నేరుగా, వేగంగా అందుతుంది. ఈ చిట్కా పాటిస్తే మీరు కచ్చితంగా వంటలో వేగాన్ని గమనించవచ్చు.






