తాజావార్తలు

కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధింపు

కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధింపు


కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధింపు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా హార్ముజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచ దేశాలు ఇంధన కొరతతో అల్లాడుతున్నాయి. ఇంధన నిల్వలు అడుగంటడంతో పాకిస్థాన్‌ స్మార్ట్ లాక్‌డౌన్ ను అమలు చేస్తోంది. పరిస్థితి చేదాటి పోతుండటంతో పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేందుకు పాక్ ప్రధాని షరీఫ్ అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రులతో అత్యవసర సమీక్ష నిర్వహించి ఇంధన పొదుపు కోసం కఠిన చర్యలకు ఆమోదముద్ర వేశారు. పంజాబ్, బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ఇతర ప్రాంతాల్లో రాత్రి 8 గంటలకే వ్యాపార సముదాయాలు మూసేయాలని ఆదేశించారు. దాంతో షాపింగ్ మాల్స్, వాణిజ్య కేంద్రాలు రాత్రి 8 గంటలకల్లా తప్పనిసరిగా తమ అమ్మకాలను నిలిపివేయాలి. రెస్టారెంట్లు, బేకరీలు, ఫుడ్ కోర్టులతో పాటు పెళ్లి మండపాలు కూడా రాత్రి 10 గంటల కల్లా ఖాళీ చేయాలి. ఇళ్లలో జరిగే ప్రైవేట్ పెళ్లి వేడుకల పైనా రాత్రి 10 గంటల తర్వాత నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సామాన్యులు ఇబ్బంది పడకుండా మెడికల్ షాపులు, ఫార్మసీలకు మాత్రమే ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కొన్ని ప్రాంతాల్లో మాల్స్ రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంచేలా కొంత వెసులుబాటు కల్పించారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు మరో నిర్ణయం కూడా తీసుకున్నారు. గిల్గిట్, ముజఫరాబాద్‌ లో నెల రోజుల పాటు ప్రభుత్వ ఖర్చుతోనే ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. డిప్యూటీ ప్రధాని ఇషాక్ దర్‌ సైతం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. హోర్ముజ్ జలసంధి మూసివేతను ముందే ఊహించిన భారత్, నేపాల్ వంటి దేశాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయి. పాకిస్థాన్ మాత్రం ఈ విషయంలో చతికిలపడింది. ఇంధన నిల్వలు నిండుకోవడంతో స్మార్ట్‌ లాక్‌డౌన్ విధించింది. ఇంధన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పాక్ ప్రభుత్వం ఇప్పుడు నానా తంటాలు పడుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది

యుద్ధం వేళ విశాఖలోని ఇరాన్ విద్యార్థినుల కష్టాలు

నాందేడ్‌లో ఆలయ ప్రసాదంలో విషం.. 150 మందికి అస్వస్థత

US-Iran Talks: అమెరికా-ఇరాన్ చర్చల వేళ.. ఊహించని అడ్డంకులు

టాలీవుడ్ లో మరో కొత్త సమస్య రెంట్ Vs పర్సంటేజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *