తాజావార్తలు

Kitchen Hacks: ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలతో క్షణాల్లో తొలగించండి

Kitchen Hacks: ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలతో క్షణాల్లో తొలగించండి


Kitchen Hacks: ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలతో క్షణాల్లో తొలగించండి

మన వంటగదిలో ఉపయోగించే ముఖ్యమైన వస్తువుల్లో కిచెన్ టవాల్స్ కూడా ఒకటి. చేతులు తుడుచుకోవడం నుండి వేడి పాత్రలను పట్టుకోవడం వరకు ప్రతిదానిలో ఇవి ఉండాల్సిందే. ఇవి లేకపోతే అసలు కిచెన్‌లో పనే గడవదు. అయితే వీటిని ఎక్కువగా వాడడం వల్ల కొన్ని సార్లు మురికిగా మారుతాయి. వాటి నుంచి దుర్వాసన కూడా వస్తుంది. కొన్నిసార్లు, సబ్బుతో ఉతికిన తర్వాత కూడా, మరకలు గానీ, జిగురు గానీ పూర్తిగా పోవు. కానీ ఇక నుంచి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో, మీరు వాటిని శుభ్రంగా, తాజాగా, మళ్లీ కొత్త వాటిలాగా మార్చుకోవచ్చు.

వంటింటి బట్టల జిడ్డు వదిలించే సులభమైన చిట్కాలు

వేడి నీరు, డిష్ వాష్ లిక్విడ్: నూనె జిడ్డును వదిలించడంలో వేడి నీరు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక బకెట్‌లో బాగా మరిగించిన వేడి నీటిని తీసుకోండి. అందులో కొంచెం డిష్ వాష్ లిక్విడ్ కలపండి. ఈ నీటిలో జిడ్డు పట్టిన బట్టలను 2-3 గంటల పాటు నానబెట్టండి. డిష్ వాష్ జెల్ నూనెను త్వరగా కరిగిస్తుంది, ఆ తర్వాత మామూలుగా ఉతికేస్తే జిడ్డు మాయమవుతుంది.

తెల్ల వెనిగర్ : వెనిగర్‌తో కూడా మీరు కిచెన్ టవాల్స్‌ను త్వరగా శుభ్రం చేయవచ్చు. వెనిగర్ కేవలం మరకలనే కాకుండా, బట్టల నుండి వచ్చే చెడు వాసనను కూడా పోగొడుతుంది. ఇందుకోసం అర కప్పు వెనిగర్‌ను నీళ్లలో కలపండి. అందులో కిచెన్ టవల్స్‌ను కాసేపు నానబెట్టండి. తర్వాత పిండి ఆరేయండి. వెనిగర్‌లోని యాసిడ్ గుణాలు మొండి జిడ్డు పొరను వదులుగా చేస్తాయి, దీనివల్ల బట్టలు తళతళలాడుతాయి.

బేకింగ్ సోడా: పాతబడిన, మొండి మరకలకు బేకింగ్ సోడా ఒక చక్కని పరిష్కారం. బేకింగ్ సోడాతో కిచెన్ టవాల్స్‌ను క్లీన్ చేసేందుకు. గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల బేకింగ్ సోడా వేసి కలపండి. ఈ నీటిలో కిచెన్ టవాల్స్‌ను నానబెట్టండి. కాసేపటి తర్వాత వాటిని మంచినీటిలో పిండి ఆరేయండి. ఇలా చేయడం వల్ల మరకలు పోవడమే కాకుండా, బట్టల్లో ఉండే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది.

నిమ్మరసం: నిమ్మరసం సహజమైన బ్లీచింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది మీ టవాల్స్‌పై ఉన్న జిడ్డును త్వరగా పోగొడుతుంది. ఇందుకోసం ఎక్కువగా జిడ్డు ఉన్న చోట నేరుగా నిమ్మరసాన్ని రుద్దండి. లేదా నీళ్లలో నిమ్మరసం వేసి ఆ నీటిలో బట్టలను వేసి కాసేపు మరిగించండి. తర్వాత దాన్ని మంచినీటిలో పిండి ఆరేయండి. ఇలా చేయడం వల్ల నూనె వల్ల ఏర్పడిన పసుపు రంగు మరకలు పోయి, బట్టలు మంచి సువాసన వస్తాయి. కిచెన్ టవల్స్ మరీ ఎక్కువగా మురికి అయ్యే వరకు ఆగకుండా, రెండు రోజులకు ఒకసారి పైన చెప్పిన పద్ధతుల్లో శుభ్రం చేసుకుంటే అవి ఎప్పుడూ తాజాగా ఉంటాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *