తాజావార్తలు

MPCA: ఎంపీసీఏ మహిళా క్రికెటర్లకు నెలవారీ పెన్షన్.. పూర్తి వివరాలివే!

MPCA: ఎంపీసీఏ మహిళా క్రికెటర్లకు నెలవారీ పెన్షన్.. పూర్తి వివరాలివే!


MPCA: ఎంపీసీఏ మహిళా క్రికెటర్లకు నెలవారీ పెన్షన్.. పూర్తి వివరాలివే!

మహిళా క్రికెటర్ల కోసం మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అసోసియేషన్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయం మొదలుపెడుతూ.. మహిళా క్రికెటర్ల సేవలను గుర్తిస్తూ, వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఎంపీసీఏ అధ్యక్షుడు మహానార్యమన్ సింధియా ప్రతిష్టాత్మకమైన ‘నెలవారీ ప్రోత్సాహక పథకాన్ని’ ప్రకటించారు. ముఖ్యంగా బీసీసీఐ పెన్షన్ పథకానికి అర్హత లేని మాజీ మహిళా క్రికెటర్ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

పెన్షన్ వివరాలు(మహిళా క్రికెటర్లకు):

అంతర్జాతీయ క్రీడాకారులు: భారత్ తరపున ఆడిన వారికి నెలకు రూ. 12,500 అందజేస్తారు.

డొమెస్టిక్ ప్లేయర్స్: దేశీయ స్థాయి క్రీడాకారులకు వారి కేటగిరీని బట్టి రూ. 6,000 నుంచి రూ. 10,000 వరకు అందుతుంది.

సీనియర్ సిటిజన్స్: 75 ఏళ్లు పైబడిన మహిళా క్రికెటర్లకు అదనంగా రూ. 7,500 సహాయం అందిస్తారు.

ఈ పథకం ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. “భవిష్యత్తును నిర్మించడంతో పాటు, మాజీ క్రికెటర్లకు గౌరవం ఇవ్వడం కూడా ముఖ్యం” అని ఈ సందర్భంగా సింధియా వ్యాఖ్యానించారు.

పురుష క్రికెటర్లు, అంపైర్లకు కూడా లబ్ధి:

కేవలం మహిళలకే కాకుండా, రిటైర్డ్ పురుష క్రికెటర్లు, అంపైర్ల పెన్షన్‌ను కూడా ఎంపీసీఏ కమిటీ పెంచింది.

పురుష క్రికెటర్లు: ఆడిన మ్యాచ్‌ల సంఖ్యను బట్టి నెలకు రూ. 7,000 నుంచి రూ. 12,500 వరకు పెన్షన్ లభిస్తుంది.

అంపైర్లు: బీసీసీఐ స్థాయి అంపైర్లకు రూ. 10,000, రాష్ట్ర స్థాయి వారికి రూ. 6,500 అందుతుంది.

గౌరవ వేతనం: స్కోరర్లకు రోజుకు రూ. 2,500, సెలెక్టర్లకు రూ. 9,000, అంపైర్లకు మ్యాచ్‌కు రూ. 5,000 చొప్పున వేతనాన్ని పెంచారు.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *