
సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది రీల్స్ పిచ్చితో పిచ్చి పిచ్చి వేషాలు చాలానే వేస్తున్నారు. లైకులు పిచ్చితో కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటే మరికొంతమంది చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. అవి చూస్తే కొన్నిసార్లు నవ్వు వస్తుంది కానీ చాలా సార్లు చిరాకు కూడా వస్తుంది. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సోషల్ మీడియా ఇన్ఫుయెన్సర్స్ చాలా మంది రకరకాలుగా పాపులర్ అవుతుంటారు. కొందరు గ్లామర్ తో మరికొంతమంది కామెడీతో, ఇంకొంతమంది తమ యాక్టింగ్ స్కిల్స్ తో క్రేజ్ తెచ్చుకుంటుంటారు, వీరందరి కంటే ఎక్కువ మంది క్రింజ్ తో పాపులర్ అవుతుంటారు. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియో కూడా అలాంటి క్రింజ్ కు సంబంధించిందే..
పైన కనిపిస్తున్న అమ్మాయి తన కడుపులో బిడ్డకు తండ్రి విరాట్ కోహ్లీ అంటూ వీడియోలు చేసి షాక్ ఇచ్చింది. అంతే కాదు విరాట్ తనకు లవ్ బైట్ ఇచ్చాడని వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఆమె.. ఆమె పేరు పెద్దగా ఎవ్వరికీ తెలియదు కానీ.. సోషల్ మీడియాలో గతంలో స్వేయ్ గర్ల్ పేరుతో వీడియోలు చేసేది. క్రికెటర్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని అయిన ఆమె ఎక్కువగా ఆర్సీబీకి సపోర్ట్ చేస్తూ వీడియోలు చేసేది.
ప్రతి ఐడీపీఎల్ సీజన్ కు రకరకాల వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యింది. కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఈ అమ్మడికి తెగ సపోర్ట్ చేస్తుంటారు. ఇంతవరకూ బాగానేఉంది .. కానీ రీసెంట్ గా ఆమె తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి విరాట్ కోహ్లీ అని చెప్పి షాక్ ఇచ్చింది. అంతే కాదు విరాట్ తనకు లవ్ బైట్ ఇచ్చాడు అని కూడా చెప్పుకుంటూ వీడియో చేసింది. ఈవీడియో వైరల్ అవ్వడంతో కోహ్లీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. ఈ పాపులారిటీ కోసం మా అభిమాన క్రికెటర్ పేరు చెడగొడతావా అంటూ ఫైర్ అవుతున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
