
BCCI Schedule : క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త. భారత గడ్డపై మరో మెగా క్రికెట్ సీజన్ మొదలుకాబోతోంది. 2026-27 సంవత్సరానికి సంబంధించి టీమిండియా సొంత గడ్డపై ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ (BCCI) అధికారికంగా ప్రకటించింది. వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. మొత్తం 17 వేదికల్లో 22 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 5 టెస్టులు, 9 వన్డేలు, 8 టీ20లు ఉన్నాయి.
* వెస్టిండీస్‌తో వైట్-బాల్ పోరు (సెప్టెంబర్ – అక్టోబర్ 2026)
టీమిండియా హోమ్ సీజన్ వెస్టిండీస్ పర్యటనతో ఘనంగా ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో ముందుగా మూడు వన్డేలు, ఆ తర్వాత ఐదు టీ20లు జరుగుతాయి.
మొదటి వన్డే: సెప్టెంబర్ 27 – తిరువనంతపురం
రెండో వన్డే: సెప్టెంబర్ 30 – గువహటి
మూడో వన్డే: అక్టోబర్ 03 – న్యూ చండీగఢ్
మొదటి టీ20: అక్టోబర్ 06 – లక్నో
రెండో టీ20: అక్టోబర్ 09 – రాంచీ
మూడో టీ20: అక్టోబర్ 11 – ఇండోర్
నాలుగో టీ20: అక్టోబర్ 14 – హైదరాబాద్
ఐదో టీ20: అక్టోబర్ 17 – బెంగళూరు
శ్రీలంకతో సమరం (డిసెంబర్ 2026)
* వెస్టిండీస్ తర్వాత డిసెంబర్ నెలలో శ్రీలంక జట్టు భారత్‌లో అడుగుపెడుతుంది. లంకతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.
మొదటి వన్డే: డిసెంబర్ 13 – ఢిల్లీ
రెండో వన్డే: డిసెంబర్ 16 – బెంగళూరు
మూడో వన్డే: డిసెంబర్ 19 – అహ్మదాబాద్
మొదటి టీ20: డిసెంబర్ 22 – రాజ్‌కోట్
రెండో టీ20: డిసెంబర్ 24 – కటక్
మూడో టీ20: డిసెంబర్ 27 – పూణే
జింబాబ్వేతో వన్డే సిరీస్ (జనవరి 2027)
* కొత్త ఏడాది 2027 ప్రారంభంలో జింబాబ్వే జట్టు భారత్‌లో మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. దీనివల్ల యువ ఆటగాళ్లకు తమ సత్తా చాటుకునే అవకాశం దక్కుతుంది.
మొదటి వన్డే: జనవరి 03 – కోల్‌కతా
రెండో వన్డే: జనవరి 06 – హైదరాబాద్ (ఉప్పల్ స్టేడియం)
మూడో వన్డే: జనవరి 09 – ముంబై
హై-వోల్టేజ్ బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (జనవరి – మార్చి 2027)
* ఈ హోమ్ సీజన్ లోనే అత్యంత ఆసక్తికరమైన పోరు ఆస్ట్రేలియాతో జరగనుంది. ప్రతిష్టాత్మకమైన 5 టెస్టుల బోర్డర్-గావస్కర్ ట్రోఫీ జనవరి 21 నుంచి ప్రారంభం కానుంది.
మొదటి టెస్ట్: జనవరి 21 నుంచి 25 వరకు – నాగ్‌పూర్
రెండో టెస్ట్: జనవరి 29 నుంచి ఫిబ్రవరి 02 వరకు – చెన్నై
మూడో టెస్ట్: ఫిబ్రవరి 11 నుంచి 15 వరకు – గువహటి
నాలుగో టెస్ట్: ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు – రాంచీ
ఐదో టెస్ట్: ఫిబ్రవరి 27 నుంచి మార్చి 03 వరకు – అహ్మదాబాద్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
