తాజావార్తలు

Watch Video: కానరాని పిచ్చుకల కిలకిలలు.. ఈ స్కూల్‌ పిల్లలు, టీచర్లు ఏం చేశారో తెలుసా..?

Watch Video: కానరాని పిచ్చుకల కిలకిలలు.. ఈ స్కూల్‌ పిల్లలు, టీచర్లు ఏం చేశారో తెలుసా..?


Watch Video: కానరాని పిచ్చుకల కిలకిలలు.. ఈ స్కూల్‌ పిల్లలు, టీచర్లు ఏం చేశారో తెలుసా..?

ఖమ్మం, మార్చి 21: ప్రపంచ పిచ్చుకల దినోత్సవం నాడు.. ఈ టీచర్స్, స్టూడెంట్స్ చేసిన పనికి మెచ్చుకోవాల్సిందే. గతంలో ఎక్కడ చూసినా పిచ్చుకల కిలకిలలతో సందడిగా ఉండేది రానురాను పొల్యూషన్ ,రేడియేషన్, చెట్లు నరికివేత తో ఈ పక్షులు అంతరించి పోతున్నాయి. వీటి మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది.

ఖమ్మం జిల్లా వేంసూరు లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులు, ఉపాధ్యాయులు కలిసి ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రేడియేషన్ కారణంగా పిచ్చుకలు అంతరించిపోతున్నాయి. అలాంటి పిచ్చుకలను పాఠశాలలో విద్యార్ధులకు ఉత్సాహాన్ని కల్పించేలా వినూత్నంగా ఆకర్షించేలా స్పారోస్ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. పిచ్చుకల చిత్రాలు, పిచ్చుకల గూడులు సహజ సిద్ధంగా ఉండేలా సెల్ఫీ పాయింట్ వద్ద అందంగా అలంకరించి ఉంచారు.

అదే విధంగా పిచ్చుకలను కాపాడుదాం.. ప్రకృతిని రక్షిద్దాం అంటూ..! అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పిచ్చుకల మనుగడపై ప్రజల్లో చైతన్యం కలిగించేలా ప్రభుత్వ హై స్కూల్ స్టూడెంట్స్, టీచర్లు కలిసి చేపట్టిన ర్యాలీ పలువురిని ఆకర్షించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *