తాజావార్తలు

ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!

ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!


ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!

ఆలుగడ్డలు (బంగాళాదుంపలు) చాలా రకాల వంటకాలకు ఉపయోగపడతాయి. చాలా మంది వారంలో ఒక్కసారైనా ఆలుగడ్డ కూర వండుకుని తినకుండా ఉండరు. కర్రీలు, ఫ్రైలు, చిప్స్‌ మొదలైనవి చేసి ఆరగిస్తుంటారు. అయితే, ఆలుగడ్డల నిల్వ విధానంలో కొన్ని పొరపాట్లు ఉంటే ఇవి త్వరగా పాడైపోతాయి. నిపుణుల సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. కొనుగోలు సమయంలో జాగ్రత్త

గట్టిగా ఉన్న బంగాళాదుంపలు ఎంచుకోవాలి. మెత్తగా ఉన్నవి చిన్న సమయంలోనే పాడైపోతాయి. ఆకుపచ్చగా ఉన్న దుంపలు కొనవద్దు. ఇవి ఆరోగ్యానికి హానికరంగా ఉండవచ్చు.

2. నిల్వ విధానం

ఫ్రిజ్‌లో ఉంచవద్దు. ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే దుంపలలోని స్టార్చ్ చక్కెరగా మారి వండినప్పుడు తియ్యగా మారుతుంది. చల్లని, గాలి ప్రసరించే, చీకటి ప్రదేశంలో నిల్వ చేయాలి. ఎక్కువ రోష్ణి లేదా ఉష్ణోగ్రత ఉన్న చోట ఉంచితే వీటికి మొలకలు వస్తాయి. వేరే కూరగాయలతో కలపవద్దు. ఉల్లిపాయలు, టమాటాలు, నిమ్మకాయలతో కలిపి ఉంచితే మొలకలు వేగంగా వస్తాయి.

3. నిల్వ పద్ధతులు

హోల్స్ ఉన్న బ్యాగులు లేదా పేపర్ సంచుల్లో ఉంచడం వల్ల ఎక్కువ రోజుల పాటు తాజా ఉంటాయి. నీటితో కడగవద్దు. నానుకరించడం వల్ల వీటిని త్వరగా పాడైపోతాయి. కొద్దిగా మొలకలు వచ్చినా, వండేటప్పుడు తీసేయాలి. వీలైతే ఆ దుంపను వాడకపోవడం మంచిది.

4. పాత, కొత్త దుంపలను వేరు ఉంచాలి

కొత్తగా తీసుకున్న బంగాళాదుంపలను పాత వాటితో కలపవద్దు. పాడైన దుంపలను వెంటనే వేరు చేయాలి, లేకపోతే మిగతావి కూడా పాడవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *