సిటీలు, పెద్ద పట్టణాల్లో యూపీఐ వినియోగం ఎక్కువగా ఉండగా.. చిన్న పట్టణాలు, గ్రామాల్లో UPI లావాదేవీలు తక్కువగా జరుగుతున్నాయి. దీంతో పట్టణాలు, గ్రామాల్లో కూడా వ్యాపారులు యూపీఐను ప్రోత్సహించేలా చేసేందుకు ఎన్‌పీసీఐ ఈ ప్రోత్సహకాలు ప్రకటించింది. టైర్ 3 నుండి టైర్ 6 కేంద్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ నోటిఫైడ్ పథకాల పరిధిలోకి వచ్చే అర్హులైన వ్యాపారులు యూపీఐ వాడేలా చేసేందుకు ఈ ప్రోత్సాహకాలు ప్రకటించారు.
