తాజావార్తలు

కాశీ వారాహి అమ్మవారి విగ్రహానికి మళ్లీ చెమటలు!


కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం కొరుపల్లి గ్రామంలో అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. స్థానిక శ్రీ కాశీ వారాహి అమ్మవారి విగ్రహానికి రెండోసారి చెమటలు పట్టాయి. ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అమ్మవారి ముఖంపై చెమట చుక్కల ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయని ఆలయ అర్చకులు ధ్రువీకరించడంతో, భక్తులు భక్తిపారవశ్యంతో అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్నారు. అమ్మవారు స్వయంగా ఈ క్షేత్రంలోనే వేంచేసి ఉన్నారనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమని భక్తులు నమ్ముతున్నారు. తమ కోరికలు తీరాలని, తమను చల్లగా చూడాలని కోరుకుంటూ అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర,సారెలు పెద్ద ఎత్తున సమర్పిస్తున్నారు. ఈ అరుదైన దృశ్యాన్ని కళ్లారా చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి భారీగా తరలివస్తున్నారు. ఇటీవలే ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ ఆధీనం నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడంతో ఆలయానికి పూర్వవైభవం సంతరించుకుంది. ఆలయ ధర్మకర్త, సీనియర్ జనసేన నాయకులు చిక్కాల దొరబాబు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం తీర్థప్రసాదాలు, ఉచిత భోజన వసతి సౌకర్యాలను ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

EPFO: ఇకపై వాట్సప్‌ నుంచే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవచ్చు!

Charan-Sukumar Film: చరణ్‌ హీరోయిన్‌గా తెలుగమ్మాయి.. ఇంతకీ ఎవరీ బ్యూటీ.. అంటే..

Jailer 2: కలెక్షన్స్‌లో జైలర్ 2 దిమ్మతిరిగే రికార్డ్.. దెబ్బకు ‘ఛావా’ అవుట్!

Jailer 2 OTT: థియేటర్లలో ఉండగానే.. OTTలోకి రజనీకాంత్ ‘జైలర్ 2’..

Subhashini: KCR వల్లే క్యాన్సర్‌ నుంచి బయటపడ్డా.. ఇండస్ట్రీలో అందరూ మారారు అంటూ.. సుభాషిణి ఎమోషనల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *