తాజావార్తలు

Bigg Boss Telugu 10: రోహిత్ ఎలిమినేషన్‌కు ప్రధాన కారణాలివే.. బిగ్‌బాస్ 10 ద్వారా ఎన్ని లక్షలు సంపాదించాడంటే?


Bigg Boss Telugu 10: రోహిత్ ఎలిమినేషన్‌కు ప్రధాన కారణాలివే.. బిగ్‌బాస్ 10 ద్వారా ఎన్ని లక్షలు సంపాదించాడంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో మరో ఊహించని ట్విస్ట్. ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో ఉండి స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకరైన రోహిత్ అనూహ్యంగా బిగ్ బాస్ 10 నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఇది అతని అభిమానులనే కాకుండా బిగ్ బాస్ ఫ్యాన్స్ ను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. టాప్ కంటెస్టెంట్లలో ఒకరు.. ఇంకా నిజం చెప్పాలంటే టైటిల్ రేసులో రోహిత్ ను ఎలిమినేట్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. ఈ విషయంలో బిగ్ బాస్ మేనేజ్మెంట్ పై అలాగే హోస్ట్ నాగార్జునపై భగ్గుమంటున్నారు రోహిత్ ఫ్యాన్స్. వెంటనే అతనిని తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక కామనర్ గా అగ్ని పరీక్ష సీజన్ 2 లో సత్తా చాటి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు రోహిత్. మొదట్లో బాగానే ఆకట్టుకున్నాడు. టాస్కుల్లో అదరగొట్టాడు. సూటిగా తన అభిప్రాయాలను చెప్పడంతో చాలా మంది రోహిత్ కు ఫ్యాన్స్ గా మారిపోయారు. సెలబ్రిటీలు కూడా ఇతడినే టార్గెట్ చేస్తూ నామినేషన్లు వేయడంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్న ముద్ర రోహిత్ పై పడిపోయింది. సోషల్ మీడియాలోనూ అతని పేరు మార్మోగిపోయింది. రోహిత్ ఆట తీరు చూస్తుంటే అతను కచ్చితంగా టాప్-5లో ఉంటారనుకున్నారు. కానీ పోనూ పోనూ రోహిత్ ఆట పూర్తిగా మారిపోయింది. హౌస్‌లో గొడవలతో ఎప్పటికప్పుడు బాగానే స్క్రీన్ పై కనిపించేవాడు గానీ టాస్కుల పరంగా పూర్ఇగా నిరాశపరిచాడు. దీనికి తోడు ఓవర్ యాటిట్యూడ్ చూపించడం. తోటి కంటెస్టెంట్లపై అనవసరంగా నోరు పారేసుకోవడం, షాలినితో గేమ్‌కి మించి క్లోజ్ అవ్వడం.. త్రిగుణ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టి తన గేమ్ మర్చిపోవడం.. ఇలా రోహిత్ ఎలిమినేషన్ కు చాలా కారణాలే ఉన్నాయి.

బిగ్ బాస్ హౌస్ లో సుమారు ఎనిమిది వారాల పాట ఉన్నాడు రోహిత్. ఈ నేపథ్యంలో రోహిత్ పారితోషికం ఎంతన్నది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా బిగ్ బాస్ హౌస్ కోసం గానూ రోహిత్ కు వారానికి రూ. 70 వేల పారితోషికం అందనుందట. ఈ లెక్కన మొత్తం 8 వారాలకు గానూ రూ.5.60 లక్షలతో పాటు అగ్నిపరీక్ష సీజన్ లో పాల్గొన్నందుకు అదనంగా రూ.50 వేలు మొత్తంగా రూ.6.10 లక్షలు రోహిత్ కు పారితోషికంగా దక్కినట్లు తెలుస్తోంది. కాగా రోహిత్ ఎలిమినేషన్ సమయంలో అతని బిగ్ బాస్ జర్నీని చూపించకపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రోహిత్ రీఎంట్రీ కచ్చితంగా ఉంటుందని, అందుకే ఏవీ వేయలేదని అతని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఎలిమినేషన్ తర్వాత ఇంట్లో రోహిత్..

 

View this post on Instagram

 

A post shared by Rohit Naidu Patnam (@rohitnaidupatnam.official)

 

View this post on Instagram

 

A post shared by Rohit Naidu Patnam (@rohitnaidupatnam.official)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *