బాక్సాఫీస్ వద్ద సూపర్‌స్టార్ రజనీకాంత్ సరికొత్త చరిత్ర సృష్టించారు. డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే వసూళ్ల సునామీ సృష్టంచిన ఈ మూవీ ఇప్పుడు మరోసారి సంచలనంగా మారింది. తాజాగా ఈ మూవీ అధికారికంగా రూ. 800 కోట్ల మైలురాయిని అధిగమించింది. తమిళ సినీ పరిశ్రమ చరిత్రలోనే రూ. 800 కోట్ల క్లబ్లో అడుగుపెట్టిన మొట్టమొదటి చిత్రంగా నిలిచి ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా మారింది. 75 ఏళ్ల వయసులోనూ రజనీకాంత్ తన బాక్సాఫీస్ స్టామినాను చాటుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రం మూడో వీకెండ్లోనూ తన ప్రభంజనాన్ని కొనసాగించింది. 18వ రోజు ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు రూ. 807.25 కోట్లకు చేరాయి. దేశీయంగా భారత మార్కెట్లో నెట్ వసూళ్లు రూ. 456.30 కోట్లకు చేరుకోగా, గ్రాస్ వసూళ్లు రూ. 533.75 కోట్ల మార్కును తాకాయి. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా రూ. 11.20 కోట్ల నికర వసూళ్లను సాధించడం విశేషం. తమిళ వెర్షన్‌తో పాటు హింది, తెలుగు వర్షన్లలోనూ ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది.
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ షేక్..
ఇండియా బాక్సాఫీస్ చరిత్రలోనే అత్యధిక గ్రాస్ రాబట్టిన చిత్రాల జాబితాలో ‘జైలర్ 2’ 16వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో భారతీయ సినిమా బ్లాక్బస్టర్లుగా నిలిచిన ‘2.0’ (రూ. 519.65 కోట్లు), ‘బాహుబలి: ది బిగినింగ్’ (రూ. 515.77 కోట్లు), ‘సలార్: పార్ట్ 1’ (రూ. 512 కోట్లు), ‘దంగల్’ (రూ. 511.58 కోట్లు) వంటి భారీ చిత్రాల ఆల్-టైమ్ దేశీయ రికార్డులను తిరగరాసింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్
ఎస్.జే. సూర్య, విద్యా బాలన్, మిథున్ చక్రవర్తి, రమ్యకృష్ణ, యోగి బాబు వంటి నటీనటులు ఈ చిత్రంలో కీలకపాత్రలో నటిచారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో రూపుదిద్దుకున్న ఈ సీక్వెల్ కోలీవుడ్ రేంజ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. నాలుగో వారం పూర్తయిన అనంతరం ఈ చిత్రం డిజిటల్ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టనుంది.
ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..
