తాజావార్తలు

Shah Rukh Khan : యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్.. కింగ్ సినిమా పై పెరిగిన అంచనాలు..


బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పుట్టినరోజు నేడు (నవంబర్ 1). ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాద్షా 61వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఆయన కథానాయకుడిగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కింగ్’. అయితే ఈరోజు బాద్షా పుట్టినరోజు కానుకగా ఈ మూవీ నుంచి తొలి పాట ‘తూ మిల్‌జాయే’ (Tu Mil Jaaye) ను మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. రొమాన్స్, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాల కలయికగా రూపొందిన ఈ పాట విడుదలై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. పాట ప్రారంభంలోనే షారుఖ్ తనదైన శైలిలో పవర్ ఫుల్ డైలాగ్ “నేను కాతిల్‌ని కాను.. ఆషిక్‌ని! నా మహబూబాయే నా లక్ష్యం” అంటూ చెప్పే మాటలు పాటకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ తర్వాత ప్రకృతి అందాల నడుమ షారుఖ్ ఖాన్, అందాల నటి దీపికా పదుకొణే మధ్య సాగే రొమాంటిక్ కెమిస్ట్రీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఒకవైపు దీపికతో ప్రేమగా కనిపించే షారుఖ్, మరోవైపు విలన్లపై విరుచుకుపడే యాక్షన్ సీక్వెన్స్ కూడా ఈ పాటలో హైలైట్‌గా నిలిచాయి.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

ఈ విజువల్ వండర్ పాటను సచిన్-జిగర్ స్వరపరచగా, ప్రముఖ గాయకుడు అరిజిత్ సింగ్, మధుబంతి బాగ్చి ఆలపించారు. ఈ పాటలో అంతర్జాతీయ పాప్ స్టార్ ఎడ్ షీరన్ పాడిన ఇంగ్లీష్ ర్యాప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పీయూష్-షాజియా నేతృత్వంలో వచ్చిన కొరియోగ్రఫీ పాటను ఎంతో కలర్‌ఫుల్‌గా మార్చింది. ‘ఓం శాంతి ఓం’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాల తర్వాత షారుఖ్ , దీపికా కాంబినేషన్‌లో వస్తున్న ఆరో ప్రాజెక్ట్ ఇది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూ్బ్ , సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ పాటకు అరిజిత్ సింగ్ తన మ్యాజికల్ వాయిస్‌తో ప్రాణం పోయగా, అంతర్జాతీయ పాప్ స్టార్ ఎడ్ షీరన్ ఇందులో ఇంగ్లీష్ ర్యాప్‌తో మరింత క్రేజ్ తెచ్చారు. సచిన్-జిగర్ సంగీతం అందించిన ఈ పాట రొమాన్స్ , యాక్షన్ కలయికగా నిలిచింది. పాట మధ్యలో , చివర్లో షారుఖ్ చెప్పే “కాతిల్ నహీ… ఆషిక్ హూన్” అలాగే “ఈసారి గుండెల్లో మంట రగిలింది…” వంటి పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

షారుఖ్ ఖాన్ పోస్ట్..

తూ మిల్‌జాయే సాంగ్..



ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *