బి కాంప్లెక్స్ విటమిన్లు వాటర్ సాల్యూబుల్ విటమిన్లు, అంటే నీటిలో కరుగుతాయి. మనం ఆహారాన్ని వండేటప్పుడు లేదా ప్రాసెస్ చేసేటప్పుడు ఈ విటమిన్లు నశించిపోయే అవకాశం ఉంటుంది. పాలిష్ పట్టిన ధాన్యాలలో కూడా పై పొరల్లో ఉండే బి1, బి2 విటమిన్లు నశించిపోతాయి. అయితే, తాటిబెల్లంలో ఈ రెండు విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. బి1 విటమిన్ (థయామిన్) నరాల బలానికి, నీరసం లేకుండా పని చేసుకోవడానికి, శరీరంలో శక్తి విడుదల కావడానికి అత్యవసరం. బి2 విటమిన్ (రిబోఫ్లేవిన్) నోటి పుండ్లు, అల్సర్స్ రాకుండా నిరోధిస్తుంది. ఇది నరాల, కణాల శక్తి ఉత్పత్తికి కీలకమైనది.
