కేవలం రూ. 2.5 కోట్ల పెట్టుబడితో ప్రారంభమై, వంద కోట్ల క్లబ్లో చేరడం ద్వారా ఈ చిత్రం సరికొత్త రికార్డును సృష్టించింది. పెట్టిన పెట్టుబడికి దాదాపు 40 నుంచి 50 రెట్లు లాభాలను తెచ్చిపెట్టి, కన్నడ సినీ చరిత్రలోనే అత్యధిక లాభాలు ఆర్జించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా, పలువురు స్టార్ హీరోల సినిమాల రికార్డులను సైతం వెనక్కి నెట్టి కన్నడలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో సముచిత స్థానం సంపాదించుకుంది.
