
మీరు డబ్బులు విత్‌డ్రా చేసేందుకు వెళ్లినప్పుడూ ఏటీఎం మిషన్‌లో బటన్స్ ప్లాస్టిక్‌లో కాకుండా ఐరన్‌లో తయారు చేసి ఉండటాన్ని మీరు చూసే ఉంటారు. చాలా మంది ప్లాస్టిక్ బటన్స్ అయితే త్వరగా విరిగిపోతాయని.. అందులే ఐరన్ బటన్స్ ఏర్పాటు చేశారని అనుకుంటారు. కానీ దీని వెనక ఉన్న అసలు కారణం వేరే ఉంది. నార్మల్‌గా ప్లాస్టిక్ కీప్యాడ్‌ను యూజ్ చేసినప్పుడు మన వేళ్ల నుండి వెలువడే ఉష్ణోగ్రత కాసేపటి వరకు ఆ బటన్లపై అలాగే ఉండిపోతుంది. దీని వల్ల సైబర్ నేరగాళ్లు లేదా దొంగలు హీట్ డిటెక్టర్ సహాయంతో మీరు నొక్కిన నంబర్స్‌ను ఈజీగా తెలుసుకోగలుగుతారు.
కానీ మెటల్ కీప్యాడ్ అలా కాదు.. ఇది ఉష్ణోగ్రతను నిల్వ చేయకుండా వెంటనే వెదజల్లుతుంది, కాబట్టి హీట్ డిటెక్టర్లతో పిన్ నంబర్‌ను కనిపెట్టడం సాధ్యం కాదు. అందుకే ఎక్కువగా ఏటీఎంలో ఐరన్ బటన్స్ వాడుతారు. అంతేకాదు ఏటీఎం కీప్యాడ్‌ను ఎక్కువ మంది యూజ్ చేస్తారు.ప్లాస్టిక్ కీప్యాడ్ అయితే త్వరగా అరిగిపోవడం లేదా పాడైపోవడం జరుగుతుంది. మెటల్ కీప్యాడ్ అయితే చాలా బలంగా ఉడడంతో పాటు ఎక్కువ కాలం పనిచేస్తుందని వీటిని వాడుతారు.
తుప్పు పట్టకుండా ప్రత్యేక డిజైన్
అయితే ATM మెషీన్లు ఎండ, తేమ ఉండే ప్రదేశాలలో కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి వీటి బటన్స్ త్వరగా తుప్పు పట్టకుండా వీటి కీ ప్యాడ్ తయారీలో రస్ట్-ఫ్రీ స్టెయిన్లెస్ స్టీల్ వంటి నాణ్యమైన లోహాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. అంతేకాదు దొంగలు మెషీన్‌ను పగలగొట్టడానికి ప్రయత్నించినా లేదా ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించినా కాలిపోకుండా ఈ మెటల్ కీస్‌ను వాడుతారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
