అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు నిర్మించిన నాలుగో చిత్రం బావగారు బాగున్నారా?. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా విజయానికి ప్రధానంగా మూడు అంశాలు దోహదపడ్డాయి. వాటిలో ముఖ్యమైనది చిరంజీవి చేసిన బంగీ జంప్. అప్పటివరకు తెలుగు తెరపై ఎవరూ చేయని సాహసంగా ఈ బంగీ జంప్ నిలిచింది. న్యూజిలాండ్‌లో సాహసికులను స్వాగతించే బంగీ జంప్ ఇది. కాళ్ళకు తాడు కట్టుకొని ఎత్తైన ప్రదేశం నుంచి కింద నీళ్లలోకి తలకిందులుగా దిగడం దీని ప్రత్యేకత. ప్రేక్షకుల హృదయాల్లో ఈ సన్నివేశం బాగా రిజిస్టర్ అవ్వడానికి థియేటర్లలో స్లో మోషన్‌లో చూపించారు. బంగీ జంప్ అనంతరం మళ్ళీ పైకి వచ్చి, కిందకు వెళ్తున్నప్పుడు తలకిందులుగా ఉన్న చిరంజీవి తన షర్ట్‌ను సవరించుకోవడం చూసి ప్రేక్షకులు ఆనందంతో చప్పట్లు కొట్టారు.
మెగాస్టార్ ఈ బంగీ జంప్ చేయడానికి సిద్ధమైనప్పుడు, నిర్మాత నాగబాబు, దర్శకుడు జయంత్ సి పరాన్జీ మొదట వద్దని వారించారు. అయినప్పటికీ, తన అభిమానులకు థ్రిల్‌ను అందించాలనే ఉద్దేశ్యంతో చిరంజీవి ఈ సాహసానికి వెనుకాడలేదు. బ్రహ్మానందం కామెడీ, సినిమాలోని కథా కథనాలు కూడా ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఈ చిత్రానికి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ టీవీలో బావగారు బాగున్నారా? వస్తే రేటింగ్ అదిరిపోద్ది అంతే. సినిమాలతో చిరంజీవి గ్రేస్‌కు మాస్ ఆడియెన్స్ మురిసిపోయారు. మొత్తం సినిమా కోసం, తన అభిమానులను రంజిపడం కోసం చిరంజీవి ఎంతటికీ వెనకాడరని ఈ స్టంట్ నిరూపించింది.
