తాజావార్తలు

గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం..

గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం..


గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఆలూరు రైల్వేగేట్ సమీపంలో కాల్పుల కలకలం రేగింది. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో, రైల్వే ట్రాక్ వెంట కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటాన్ని గస్తీలో ఉన్న పోలీసులు గమనించారు. సదరు వ్యక్తుల చేతుల్లో కట్టర్లు , ఇతర ఆయుధాలు ఉండటంతో, వారు దోపిడీకి ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నించగా, వారు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు గాల్లోకి 10 రౌండ్ల కాల్పులు జరిపారు.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *