తాజావార్తలు

రూ.50 వేల ఖర్చు… రూ.2 లక్షల లాభం…ఈ పంట రైతులను ధనవంతులను చేస్తుంది..? ఆ రహస్యం ఇదే!


ప్రస్తుత కాలంలో సాంప్రదాయ పంటల కంటే వాణిజ్య పంటలు, మూలికా సాగు వైపు రైతులు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అందులో ముఖ్యంగా కలబంద సాగు అతితక్కువ ఖర్చుతో అత్యధిక లాభాలను అందించే లాభదాయక వ్యాపారంగా నిలుస్తోంది. ఔషధ, సౌందర్య సాధనాలు, ఆయుర్వేద ఉత్పత్తుల తయారీలో కలబంద వినియోగం విపరీతంగా పెరగడమే దీనికి ప్రధాన కారణం.

1. నేలలు, వాతావరణం

అలోవెరా సాగుకు పొడి, ఉష్ణమండల వాతావరణం అనుకూలం.

నేలలు: ఉసుక నేలలు, నల్లరేగడి, తక్కువ సారవంతమైన భూముల్లో కూడా ఇది బాగా పెరుగుతుంది. నీరు నిల్వ ఉండని ప్రదేశాలను ఎంచుకోవాలి.

ఇవి కూడా చదవండి



నీటి సదుపాయం: అలోవెరాకు చాలా తక్కువ నీరు అవసరం. బిందు సేద్యం ద్వారా సాగు చేయడం వల్ల నీటి వృథాను అరికట్టవచ్చు.

2. నాటే పద్ధతి,యాజమాన్యం

ఒక ఎకరానికి దాదాపు 10,000 నుండి 12,000 వరకు మొలకలు అవసరమవుతాయి. మొక్కల మధ్య తగినంత దూరం ఉంచడం వల్ల గాలి, వెలుతురు సరిగ్గా సోకి ఆకులు దృఢంగా, దట్టంగా పెరుగుతాయి. ఒకసారి నాటిన తర్వాత 10 నుండి 12 నెలల్లో మొదటి కోతకు వస్తుంది.

3 చీడపీడల నివారణ, నిర్వహణ

కలబంద పంటకు పురుగుల బెడద చాలా తక్కువగా ఉంటుంది. క్రిమిసంహారకాల కంటే పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్ వంటి సేంద్రీయ ఎరువులను ఉపయోగించడం వల్ల గుజ్జు నాణ్యత పెరుగుతుంది. మార్కెట్‌లో సేంద్రీయ పద్ధతిలో పండించిన కలబందకు మంచి ధర లభిస్తుంది.

4. ఆదాయం, విక్రయం

ఒక ఎకరం నుండి ఏటా 15 నుండి 20 టన్నుల వరకు ఆకుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాస్మెటిక్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లతో ముందుగానే బై-బ్యాక్ ఒప్పందాలు చేసుకోవడం వల్ల విక్రయం సులభమవుతుంది. సరియైన ప్రణాళికతో సాగు చేస్తే ఎకరానికి అన్ని ఖర్చులు పోను రూ. 1.5 నుండి 2 లక్షల వరకు నికర లాభం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *