వీడెవడండీ బాబూ.. ఆర్టీసీ బస్సుపైనే కన్నేశాడు! పట్టపగలు దర్జాగా బస్సుతో పరారైన దొంగ బాబు..
నిత్యం ఎక్కడో ఒకచోట చోరీలు జరగడం షరా మామూలే. సాధారణంగా దొంగలు డబ్బు, బంగారం, బైకులు, వాహనాలను చోరీ చేయడం చూస్తుంటాం. అయితే జగిత్యాల జిల్లాలోని కోరుట్లలో జరిగిన ఓ ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు. అది కూడా నిత్యం ప్రజలను గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సుపైనే కన్నేయడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ ఘటన కోరుట్ల బస్టాండ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు దాదాపు 18 కిలోమీటర్ల పాటు…
