వర్షాకాలంలో మరి చల్లని డ్రింక్స్ తాగిన జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో ఆరోగ్యానికి బలాన్ని ఇచ్చే డ్రింక్స్ తాగడం మంచిది. వాటిలో కొబ్బరి పాల బాద డ్రింక్ కూడా ఒకటి. మీరు దీనిని వేడి వేడిగా తాగొచ్చు లేదంటే కొద్దిగా చల్లగా కూడా తాగొచ్చు. ఇది ఇప్పుడు కన్నా కూడా పాత రోజుల్లో ఎక్కువగా తాగే వాళ్ళు. ఈ పాల డ్రింక్ ఒక్కసారి తాగితే అసలు వదలరు.
ఇంకా చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది శరీరానికి శక్తిని అందిస్తుంది.
కొబ్బరి పాల బాదం డ్రింక్ కు కావాల్సిన పదార్దాలు : రెండు కప్పుల కొబ్బరి పాలు, కొద్దిగా కొబ్బరి తురుము, అర కప్పు నీరు, పావు కప్పు బెల్లం తురుము, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 10 జీడిపప్పు లు, 10 బాదంపప్పులు, ఒక టేబుల్ స్పూన్ కుంకుమపువ్వును తీసుకోవాలి.
కొబ్బరి పాల బాదం డ్రింక్ తయారి విధానం : ముందుగా కొబ్బరి తురుములో కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసి దానిని మిక్సీలో రెండు సార్లు గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడపోసుకుని, దాని నుంచి కొంచం చిక్కటి కొబ్బరి పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే, దీనితోనే ఈ రెసిపిని తయారు చేస్తాము ఇదే మెయిన్. కొంచం జాగ్రత్తగా కొబ్బరి పాలను తీసుకోవాలి.
కొబ్బరి పాల బాదం డ్రింక్ తయారి విధానం స్టెప్ – 1: ఒకసారి కొబ్బరి ముద్ద నుంచి తీసిన పాలను విడిగా పెట్టుకోవాలి. ఇంకోసారి కప్పు నీళ్ళు వేసి మళ్లీ గ్రైండ్ చేసి ఇంకోసారి కూడా దీని నుంచి పాలను తీసుకోవాలి. రెండోసారి తీసుకున్న కొబ్బరి పాలలో కొద్దిగా బెల్లం వేసి వాటిని బాగా మరిగించుకోవాలి . ఇంకా ఈ బెల్లం మొత్తం కరిగిన పోయిన తర్వాత అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసి కలపండి.
స్టవ్‌ను మీడియం మంట మీద ఉంచి కనీసం 5 నిమిషాల పాటు వీటిని బాగా ఉడికించి బాదం పొడిని వేసుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, దీని నుంచి చిక్కటి కొబ్బరి పాలు తీసుకుని దానిలో వేయించిన జీడిపప్పు, బాదంపప్పులు కూడా వేసి మిక్స్ అయ్యేలా దీనిని బాగా కలుపుకోవాలి. ఇంకా వేడి వేడిగా కప్పుల్లో పోసి సర్వ్ చేయండి. చల్లగా తాగాలనుకుంటే పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్ చేయండి.





