EPFO: సంక్రాంతి గిఫ్ట్ అంటే ఇది కదా.. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెన్షన్ భారీగా పెంపు..?
ఎంప్లాయూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) దేశంలోని ప్రైవేట్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగులకు లబ్ది చేకూర్చేందుకు ఈపీఎఫ్‌లో ఎప్పటికప్పుడు నూతన మార్పులు అమలు చేస్తోంది. తాజాగా ఉద్యోగులకు మరింత బెనిఫిట్ జరిగేలా ఈపీఎఫ్‌వో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చూట్టేందుకు రెడీ అవుతోంది. పీఎఫ్ ఖాతాదారులకు ఉద్యోగుల పెన్షన్ పథకం(EPS)ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత నెలనెలా పెన్షన్ అందించడమే ఈ పథకం…
