Telangana: బాల్యానికి విముక్తి.. ఆపరేషన్ ముస్కాన్‌తో 6,307 మంది చిన్నారుల ముఖాల్లో నవ్వులు!
బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా నిర్మూలనే లక్ష్యంగా తెలంగాణ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ ముస్కాన్-12’ ఎట్టకేలకు ముగిసింది. జూలై 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో సుమారు 6,307 మంది చిన్నారులను పోలీసులు సురక్షితంగా రక్షించారు. మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో పోలీసు, మహిళా శిశు సంక్షేమ, కార్మిక, వైద్య శాఖలు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, జిల్లా బాలల సంరక్షణ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు…
