తాజావార్తలు

2027 World Cup: దినేష్ కార్తిక్ డ్రీమ్ స్క్వౌడ్! ఇంతకంటే బెస్ట్ టీమ్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ..

2027 World Cup: దినేష్ కార్తిక్ డ్రీమ్ స్క్వౌడ్! ఇంతకంటే బెస్ట్ టీమ్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ..


2027 ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, మాజీ భారత వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ఇప్పటికే తన అంచనా భారత జట్టును ప్రకటించారు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులైన సీనియర్ క్రికెటర్లకు కూడా స్థానం కల్పించారు. ముఖ్యంగా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయడం, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు మళ్లీ అవకాశం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

కెప్టెన్‌గా గిల్.. సీనియర్లకు పూర్తి మద్దతు

దినేష్ కార్తిక్ ఎంపిక చేసిన జట్టులో శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించారు. భవిష్యత్ భారత జట్టును నడిపించే సామర్థ్యం గిల్‌కు ఉందని కార్తిక్ విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు ఇంకా జట్టుకు కీలక బలమని, వారి అనుభవం ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

బ్యాటింగ్ విభాగంలో బలమైన లైనప్

బ్యాటర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్‌లను ఎంపిక చేశారు. యువత, అనుభవం కలగలిపిన ఈ బ్యాటింగ్ లైనప్ ప్రత్యర్థి బౌలర్లకు గట్టి సవాలు విసురుతుందని కార్తిక్ భావించారు.

వికెట్ కీపర్లుగా రాహుల్, ఇషాన్

వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లను ఎంపిక చేశారు. బ్యాటింగ్‌తో పాటు అవసరమైన సమయంలో ఇన్నింగ్స్‌ను నిర్మించే సామర్థ్యం ఈ ఇద్దరికీ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆల్‌రౌండర్లలో హార్దిక్‌కు ప్రాధాన్యం

ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ మ్యాచ్‌ను మలుపుతిప్పే సామర్థ్యం వీరికి ఉందని కార్తిక్ పేర్కొన్నారు.

భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ హైలైట్

ఈ జట్టులో అత్యంత ఆశ్చర్యకర ఎంపిక భువనేశ్వర్ కుమార్. చాలా కాలంగా వన్డే జట్టుకు దూరంగా ఉన్న భువీని కార్తిక్ తిరిగి తన జట్టులో చేర్చారు. అతని అనుభవం, కొత్త బంతితో వికెట్లు తీయగల సామర్థ్యం ప్రపంచకప్‌లో భారత జట్టుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ కూడా చోటు దక్కించుకున్నారు. స్పిన్ బాధ్యతను కుల్దీప్ యాదవ్‌కు అప్పగించారు. అయితే ఈ టీమ్ చూసిన తర్వాత క్రికెట్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతకంటే బెస్ట్ టీమ్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్ అంటూ సోషల్ మీడియాలో సరదాగా కామెంట్ చేస్తున్నారు.

దినేష్ కార్తిక్ డ్రీమ్ స్క్వౌడ్

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *