తొక్కుడు బిల్లతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? ఎలా ఆడతారు? రూల్స్ గుర్తున్నాయా?
ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని దాదాపు ప్రతి గ్రామంలో పిల్లలు తెగ ఆడిన తొక్కుడు బిల్ల ఆట ఇప్పుడు క్రమంగా కనుమరుగవుతోంది. ముఖ్యంగా బాలికలు ఎక్కువగా ఆడే ఈ ఆట, శారీరక చురుకుదనం, ఏకాగ్రత, సమతుల్యత, ఓర్పును పెంపొందించే వినోదభరితమైన గ్రామీణ క్రీడగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, వీడియో గేమ్స్ ప్రభావంతో ఈ ఆటను ఆడే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. తొక్కుడు బిల్ల ఆడేందుకు నేలపై సున్నం లేదా బొగ్గుతో వరుసగా చిన్న…
