గుడ్‌న్యూస్.. పోస్టాఫీసులో పేపర్ వర్క్ లేకుండానే డిపాజిట్లు, విత్‌డ్రాలు!
పోస్టాఫీసు ఖాతాదారులకు భారత తపాలా శాఖ పెద్ద ఉపశమనం కలిగించింది. ఇకపై చిన్న మొత్తాల లావాదేవీల కోసం ఎలాంటి పేపర్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్ ఈ-కేవైసీ , బయోమెట్రిక్ విధానం ద్వారా సులభంగా నగదు డిపాజిట్, విత్‌డ్రా చేసుకునే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. జూన్ 22 నుంచే ఈ సరికొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం.. సుకన్య సమృద్ధి యోజన, ఆర్‌డీ , సేవింగ్స్ ఖాతాదారులు ఎలాంటి ‘పే-ఇన్ స్లిప్’…
