క్రికెట్లో చాలా మంది అభిమానులకు కిక్ ఇచ్చేది థ్రిల్లింగ్ మ్యాచ్‌లే. మొత్తం మ్యాచ్ ఎలా జరిగినా.. చివర్లో ఉత్కంఠభరిత ముగింపు లభిస్తే.. ఆ రోజు హాయిగా పడుకుంటారు. ఇప్పటికే క్రికెట్ హిస్టరీలో అలాంటి ఎన్నో థ్రిల్లింగ్ మ్యాచ్‌లు చూసిన వారికి ఇప్పుడు చెప్పుకోబోయే మ్యాచ్ మరింత థ్రిల్ అయితే ఇవ్వడం పక్క. ఎందుకంటే అలాంటి ఎండింగ్ దొరికింది ఈ మ్యాచ్‌కి. చివరి ఓవర్లో 6 పరుగులు కావాలి. చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. టీ20 మ్యాచ్‌లో ఇలాంటి సినారియో ఉంటే ఎవరైనా ఏం అనుకుంటారు బ్యాటింగ్ టీమ్ గెలుస్తుంది అనుకుంటారు కదా..
కానీ బౌలింగ్ టీమ్ అభిమానుల హాట్ బీట్ పెంచేసింది. లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ డాట్, తర్వాత మూడు బంతుల్లో మూడు వికెట్లు. అంతే స్టేడియం అంతా షాక్. 6 బాల్స్‌లో 6 రన్స్ అనే టైమ్‌లో బౌలర్ నాలుగు బంతుల్లోనే మూడు వికెట్లు తీస్తే.. పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. బ్యాటింగ్ 9 వికెట్లు కోల్పోయింది. చేతిలో ఒక్క వికెట్ ఉంది, మిగిలిన రెండు బంతుల్లో 6 పరుగులు కావాలి. క్రీజ్‌లోకి కొత్త బ్యాటర్ వచ్చాడు. అంతా టెన్షన్.. టెన్షన్.. సెట్ అయి ఉన్న బ్యాటర్ నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్నాడు. మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారో.. అందరికీ అర్థమైంది.
ఓవర్ ఆరంభంలో విజయం మాదే అనుకున్న టీమ్ డగౌట్లో నిరాశ అలుముకుంది. ఒక ఓటమి తప్పదు అనుకున్న బౌలింగ్ టీమ్ ఆటగాళ్ల ముఖాలపై నవ్వులు పూస్తున్నాయి. అయితే ఐదో బంతికి లెగ్ బైస్ రూపంలో సింగిల్ మాత్రం వచ్చింది. దీంతో బౌలింగ్ టీమ్ మరింత హ్యాపీ, బ్యాటింగ్ టీమ్ ఆల్మోస్ట్ ఓటమిని అంగీకరిస్తున్నట్లు కనిపించింది. చివరి బాల్.. 5 రన్స్ కావాలి. బౌండరీ పోయినా మ్యాచ్ టై మాత్రమే అవుతుంది. ఈ ఒక్క బాల్ సరిగ్గా వేస్తే చాలు.. చివరి ఓవర్లో 6 సిక్స్ రన్స్ డిఫెండ్ చేయడమే కాకుండా, హ్యాట్రిక్ కూడా తీసుకున్న బౌలర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అదే కాన్ఫిడెన్స్‌తో చివరి బాల్ వేశాడు… అప్పటి వరకు నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉండి.. వికెట్ల పతనం చూస్తున్న బ్యాటర్.. ఆ కోపమంతా చివరి బాల్‌పై చూపించాడు.. మిడ్ వికెట్ మీద నుంచి ఫ్లాట్‌గా సిక్స్ వెళ్లిపోయింది. అంతే దెబ్బకు సీన్ మారిపోయింది.
కచ్చితంగా గెలుస్తుందనుకున్న టీమ్.. చివరి బాల్కి ముందు ఓటమి అంచున నిల్చోని.. లాస్ట్ బాల్కి విజాయన్ని ముద్దాడింది. ఈ ఓవర్ లైవ్‌లో చూసిన క్రికెట్ ఫ్యాన్స్ అయితే ఆ ట్విస్ట్‌లకు పిచ్చోళ్లు అయిపోయారు. ఇది కదా క్రికెట్ మజా అంటూ ఉబ్బితబ్బియ్యారు. సోషల్ మీడియాలో ఈ లాస్ట్ ఓవర్‌కి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ క్రేజీ లాస్ట్ ఓవర్ ఈ మ్యాచ్‌లో జరిగిందో చెప్పలేదు కదూ.. అమెరికా వేదికగా జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టీ20 టోర్నీలో జరిగింది. టెక్సాస్ సూపర్ కింగ్స్, వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్.. వంద థ్రిల్లర్ సినిమాలను మించి సాగింది. ముఖ్యంగా ఆ లాస్ట్ ఓవర్ అయితే మైండ్ బ్లోయింగ్ అంతే. ఇంతకీ లాస్ట్ బాల్కి సిక్స్ కొట్టి మ్యాచ్‌కు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్లేయర్ ఎవరో తెలుసా.. నిఖిల్ చౌదరీ. పేరు వినగానే మన తెలుగుబ్బాయి అనుకున్నారా? ఎస్ మనోడే కానీ.. ఆస్ట్రేలియా తరఫున క్రికెట్ ఆడుతుంటాడు.
వీడియో చూడండి
– 6 Needed of 6 balls.
– Akeal Hosein picked hattrick.
– Nikhil Choudhary hit SIX on last ball.THIS IS PEAK CRICKET IN MLC – ONE OF THE FREAKIEST OVER IN HISTORY. 🔥🥶pic.twitter.com/mAyDERDz1I
— Tanuj (@ImTanujSingh) June 28, 2026
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
