Amit Shah: ప్రతి గిరిజనుడిలోనూ భగవాన్ బిర్సా ముండా రూపం కనిపిస్తోంది- హోంమంత్రి అమిత్ షా
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో నిర్వహించిన గిరిజన సాంస్కృతిక సమాగమం భవ్యమైన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఈ మహాసభను గిరిజనుల మహాకుంభంగా అభివర్ణించారు. ఈ సాంస్కృతిక సమాగమం రాబోయే అనేక సంవత్సరాల వరకు గిరిజనుల ఉనికి, అస్తిత్వం, సంస్కృతి ఉద్యమానికి ఒక కొత్త గుర్తింపునిచ్చేదిగా నిలుస్తుందని ఆయన అన్నారు. తాను భగవాన్ బిర్సాను చూడలేదని.. కానీ ఈ రోజు ఇక్కడ ఉన్న గిరిజనులలో ఆయన ప్రతిరూపం కనిపిస్తోందన్నారు….
