అన్నమయ్యకు అరుదైన గౌరవం.. అమెరికాలో 111 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటు!
అమెరికాలోని టెనెసీ రాష్ట్రం, మెంపిస్ నగరంలో ఉన్న ఇండియన్ కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ ఆధ్వర్యంలో అన్నమయ్యకు అంకితంగా 111 అడుగుల ఎత్తైన మహావిగ్రహం నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సుమారు రూ.50 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు, ముఖ్యంగా తెలుగు ప్రజల మద్దతుతో ఈ నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోంది. అన్నమయ్య కీర్తనలు ప్రపంచవ్యాప్తంగా భక్తి సంగీతానికి ప్రతీకగా నిలిచిన నేపథ్యంలో, ఆయనకు ఈ స్థాయిలో గౌరవం లభించడం విశేషంగా భావిస్తున్నారు….
