బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఆరో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టింది సీరియల్ నటి ఛైత్ర రాయ్. తన 10 నెలల బిడ్డను సైతం వదిలేసి ఈ రియాలిటీ షోలోకి అడుగు పెట్టిందీ అందాల తార. అప్పటికే బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ లో చాలా రోజుల పాటు ఉంటుందనుకున్నారు
కానీ బిగ్ బాస్ హౌస్ లో కుదురుకునేలోపే ఛైత్ర రాయ్ ఎలిమినేట్ అయిపోయింది. మొదటి వారంలోనే ఆమె బయటకు వచ్చేసింది. దీంతో ఆమె అభిమానులు చాలా నిరాశకు లోనయ్యారు. తనను తాను నిరూపించేకునేందుకు ఛైత్ర కు కనీసం ఒక్క అవకాశం కూడా రాలేదని బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫీలయ్యారు.
కాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఛైత్ర మళ్లీ సీరియల్స్, టీవీ షోలతో బిజీ అవుతోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఇద్దరు కూతుళ్లతో కలిసి దిగిన క్యూట్ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంది. దసరాను సెలబ్రేట్ చేసుకున్న ఆమె ఈ ఫొటోలను అందరితో పంచుకున్నారు.
ప్రస్తుతం నటి ఛైత్ర రాయ్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఛైత్ర ఇద్దరు కూతుళ్లు చాలా క్యూట్ గా ఉన్నారంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
కాగా అష్టా చెమ్మా సీరియల్తో తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యింది చైత్ర రాయ్. ఆ తర్వాత రాధా కళ్యాణం, ఒక్క క్షణం, తథాస్తు, అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు తదితర సూపర్ హిట్ సీరియల్స్ తో ఇక్కడి ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.
కేవలం సీరియల్స్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు సినిమాల్లోనూ ఛైత్ర యాక్ట్ చేస్తోంది. ఆ మధ్యన గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించిందీ అందాల తార. ఇక చైత్ర రాయ్ భర్త పేరు ప్రసన్న శెట్టి. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు






